ఐపిఎల్ సెకండ్ హాఫ్ ఇంకో పదిహేను రోజుల్లో ముగుస్తుంది.దీంతో ప్లే ఆఫ్స్ పోరుకి సంబంధించిన కీలక మ్యాచ్ లు ఈ వీకెండ్ లో జరగనున్నాయి.దీంతో క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.తాజాగా సన్ రైజర్స్ పై విజయం సాధించిన చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.ఇక మిగతా మూడు స్థానాలు కోసం నాలుగు టీమ్ లు పోటీ పడుతున్నాయి.ఈ వీకెండ్ పాయింట్ టేబుల్స్ టీమ్ ల భవితవ్యాన్ని కాదు ఆరెంజ్,పర్పుల్ క్యాప్ రేసులో టాప్ లో కొనసాగుతున్న ప్లేయర్స్ భవితవ్యాన్ని కూడా నిర్ణయించనున్నది.మరి ఆసక్తిగా సాగనున్న ఈ వీకెండ్ మ్యాచ్ లలో విజయలక్ష్మి ఎవర్ని వరించనున్నదో వేచి చూడాల్సివుంది