స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో బన్నీ సరసన రష్మీక నటిస్తుంది.రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.తాజాగా ఈ మూవీ షూటింగ్ లొకేషన్ ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టైటిల్ సాంగ్ కు విశేష స్పందన లభించింది.ఈ మూవీలో బన్నీ పక్కా మాస్ లుక్ లో కనిపించనున్నారు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.