టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి మూవీ తో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ… మారిపోయాడు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, గీతా గోవిందం, లైగర్ ఇలాంటి ఎన్నో మూవీ లు చేసి స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.
పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ
ఇక ఇటీవల కాలంలోనే హీరోయిన్ సమంత తో ఖుషి మూవీ చేసి… అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు సమంత ప్రమోషన్స్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారంట . అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు . అయితే నార్మల్ ఫోటోను షేర్ చేస్తే పర్లేదు కానీ…. ఒక అమ్మాయి చేయి ఉన్న ఫోటోను షేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.

నా లైఫ్ లో చాలా జరుగుతున్నాయి కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ అంటూ ఈ పోస్టర్ పై రాసుకోవచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్లు అర్థం వచ్చేలా రాసుకొచ్చాదంట . అయితే ఈ పోస్టర్ చూసిన నేటిజన్స్ అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్… మనోడు త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ నే విజయ్ పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం కొత్త సినిమా ప్రకటన అయి ఉండవచ్చని చెబుతున్నారు.