దేశాన్ని మాత్రమే కాదు విదేశాలలో సైతం తన సత్తా చాటిన సినిమా పుష్పకు నిన్న జాతీయ అవార్డు లలో అల్లు అర్జున్ ఉత్తమ్ హీరోగా గెలుపొందిన విషయం మనకి తెలిసిందే. దేశమంతా ఇతన్ని మంచి పొగడ్తలతో ముంచెత్తించారు , కాగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఈ రోజు బ్రహ్మానందం ఇంట్లో ప్రత్యక్షము అయ్యాదంట . అయితే ఎందుకు అల్లు అర్జున్ బ్రహ్మి ఇంటికెళ్ళాడు అన్న విషయంలో కొందరికి సందేహాలు ఉన్నాయని బాగా తెలుస్తోంది.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం గత వారంలో బ్రహ్మానందం కుమారుడికి వివాహం జరుగగా, అందుకు అల్లు అర్జున్ కొన్ని పనుల కారణంగా హాజరు కాకపోవడంతో … ఈ రోజు వచ్చి కలిసి వారికి శుభాకాంక్షలు తెలియచేశాడు. ఇక ఈ ఇంట్లో అల్లు అర్జున్ గంటన్నర సేపు వారితో ముచ్చటించారు. అనంతరం బ్రహ్మనందం అల్లు అర్జున్ ను సత్కరించారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.