WhatsApp వెబ్ బీటాలో కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్ రాబోతోంది.
WhatsApp గోప్యతను మెరుగుపరచడానికి WhatsApp వెబ్ యొక్క బీటా ప్రోగ్రామ్ తామ వినియోగదారులకు కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్‌ను విడుదల చేయబోతుంది. WhatsApp వినియోగదారులు ఈ ఫీచర్‌ను యూస్ చేస్తునపుడు, వాట్సాప్ వెబ్‌ను అన్‌లాక్ చేయడానికి పాస్వర్డ్నుఎంటర్ చేయాల్సి ఉంటుందని WABetaInfo చెపుకొచ్చింది .

యూజర్స్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, వారు వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ అయి , QR కోడ్‌ని మళ్లీ స్కాన్ చేయడం ద్వారా లాగిన్ అవాల్సివుంటుంది. ఈ కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకుండా యూజర్స్ వాట్సాప్ చాట్లు మరియుమెసేజ్ లను ఎవరూ యాక్సెస్ చేయలేరు అని తెలిపింది. “ఈ కొత్త ఫీచర్ యూజర్స్ డేటా ప్రైవసీ మరింత మెరుగుపరచడం మరియు వారి సంభాషణల గోప్యతను భద్రపరచడం జరుగుతుంది అలాగే వారి వ్యక్తిగత సమాచారాన్ని చూడకుండా చేస్తుంది “