పవన్ కళ్యాణ్ ఎప్పటికి సీఎం కాలేడు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అన్నారు. ఆయన పరిపాలన చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఆయన సీఎం కావాలని ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాను మరొకరికి సహకరించడానికి తాను ఉన్నాను అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అన్నారు. పవన్ కళ్యాణ్ లీడర్ అవుతానంటే అందరూ ఆయన వెనుక వస్తారని.. మరొకరి కి పల్లకి మోస్తాను అంటే ఆయన్ను అందరిలో ఒకడిగా చూస్తారన్నారు
పదేళ్ల కాలంలో పవన్ మాత్రం గెలవలేకపోయారని.. ఆయన్ను ప్రజలు ఓడించడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో జనాలకు తెలియజేయాలన్నారు. ఆయన అనుకుంటున్నట్టు ఏవైనా ఇబ్బందులు ఉంటే కేసు మీద కేసు వేయండి, కోర్టులు ఉన్నాయి కదా అన్నారు. పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనదని.. ఒక వాలంటీర్ ఒక నెల రోజులు సెలవు పెడితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
వాలంటీర్లకు అండగా వైఎస్సార్‌సీపీ
వాలంటీర్లు ప్రతి ఇంట్లో ఆప్యాయంగా పలకరిస్తున్నారు అని అన్నారు. వాలంటీర్లకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని.. అదే క్రమంలోనే తప్పులు చేసిన కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు కేతిరెడ్డి.
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలు ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ బాగుందని ఇతర రాష్ట్రాలు ఈ వ్యవస్థని ఆదర్శంగా తీకుంటున్నా సంగతి పవన్ కళ్యాణ్ కు కనపడటం లేదా అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ బావుందనే చంద్రబాబు 30 ఇళ్లకు క్లస్టర్ ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారని.. ఎందుకు గతంలో మాదిరి జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పడం లేదన్నారు. ఏలూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.