రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తేజా సజ్జా హనుమాన్ మూవీ రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయంటే…
రవితేజ (Ravi Teja) టైగర్ నాగేశ్వరరావుతో పాటు తేజ సజ్జా (Teja Sajja) హనుమాన్ రిలీజ్ డేట్స్‌ను శనివారం అనౌన్స్‌చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. హనుమాన్ మాత్రం పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతి రేసులోకి వెళ్లిపోయింది.

వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. తొలుత ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులకు ప్రాధాన్యమున్న మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతోన్నట్లు సమాచారం. అందుకే సంక్రాంతికి ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలిసింది.
హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్నాడు. సూపర్ హీరో కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. హనుమాన్ అండతో దుష్టశక్తులపై ఓ యువకుడి సాగించిన పోరాటం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీని తెరకెక్కించారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయ్‌రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
దసరాకు టైగర్ నాగేశ్వరరావు
టైగర్ నాగేశ్వరరావు దసరా రేసులో నిలిచింది. విజయదశమి కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాణ సంస్థ శనివారం ప్రకటించింది. స్టూవర్టుపురానికి చెందిన బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితానికి కల్పిన అంశాలను జోడించి దర్శకుడు వంశీ కృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో రేణుదేశాయ్ కీలక పాత్రను పోషిస్తోంది.