సినిమాలు చేస్తూ సోషల్ మీడియా లో ట్రెండింగ్‌లో ఎవరైనా ఉంటారు .. కానీ అవి ఎం చేయకుండా.. ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కూడా ట్రెండింగ్‌లో ఉండటం అంటే కేవలం అది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కి మాత్రమే సాధ్యం అవుతుంది. సాయి పల్లవి ఈ మధ్య అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కనిపించట్లేదు అని కొందరు అంటుంటే, మరి కొందరు ఈమెని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోట్లే అని అంటున్నారు.
ప్రతి రోజు ఎదో ఒక వార్త రూపంలో సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం సాయిపల్లవి ఎన్టీఆర్ తో దేవర సినిమాలో జత కట్టనుంది అనే వార్త వైరల్మ్ అయింది . తాజాగా ఈమె ఎందుకు సినిమాలు చెయ్యట్లేదు అని వార్త వైరల్ అవుతుంది. ఈలా ఎదో ఒక న్యూస్ తో సాయి పల్లవి ట్రేండింగ్ లో ఉంటుంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఫాలోయింగ్ సొంతం చేసుకున్నా ఒకే ఒక హెరాయిన్ సాయి పల్లవి. హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి కూడా సొంతం అయింది