హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఆయన ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వరుణ్ తేజ్, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో సందడి చేశారు.
ఇక ఈ ఏడాది చివర్లో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల వివాహం జరగనుందని సమాచారం. అయితే కొత్త జంట పెళ్లికి ముందే విహరిస్తున్నారు. వరుణ్ తేజ్-లావణ్యల రొమాంటిక్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. నిశ్చితార్థం ముగిసిన వెంటనే ఇద్దరు విదేశాలకు చెక్కేశారు. వీధిలో వరుణ్ చేతిని పట్టుకొని నడుస్తున్న లావణ్య నవ్వులు చిందిస్తుంది. వరుణ్ ఆమెకు ఏదో వివరిస్తున్నారు. ఈ ఫోటో చూస్తే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

2017లో మిస్టర్ మూవీ షూటింగ్ కోసం లావణ్య త్రిపాఠి-వరుణ్ మొదటిసారి కలిశారు. అనంతరం 2020లో అంతరిక్షం టైటిల్ తో ఓ మూవీ చేశారు. రిలేషన్ లో ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా పుకార్లు మొదలయ్యాయి. నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరిగింది. చిత్ర పరిశ్రమ నుండి కేవలం నిహారికకు మాత్రమే ఆహ్వానం లభించింది. ఇది చర్చకు దారి తీసింది.
మొదట్లో వరుణ్ తో ఎఫైర్ వార్తలను లావణ్య ఖండించారు. మేము కేవలం మిత్రులం మాత్రమే. ఎలాంటి ఎఫైర్ లేదంటూ నొక్కి వక్కాణించారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. ఇక లావణ్య కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. పెళ్లయ్యాక ఆమె యాక్టింగ్ మానేసే అవకాశాలు కలవు. ఇక వరుణ్ తేజ్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాంఢీవదారి అర్జునుడు మూవీ చేస్తున్నారు.