లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు వారి వివాహ వార్షికోత్సవం సందర్భం గా తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ విఘ్నేశ్ పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోం ది. వాళ్ల పిల్లల ఫొటోలను కూడా షేర్ చేయడం తో సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నా రు.

‘‘నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పు డే ఏడాది అయిపోయిం ది. ఈ సం వత్సరంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం . ఎన్నో ఊహించని పరాజయాలు.. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎన్ని చికాకులు ఉన్నా ఒక్క సారి ఇంటికి వచ్చి నిన్నూ పిల్లల్ని చూడగానే అన్నీ మర్చి పోతాను. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇక నయనతార- విఘ్నేశ్ శివన్ లు గతేడాది అక్టోబరులో తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. తమ ట్వి న్ బేబీ బాయ్స్ కు ఉయిర్, ఉలగమ్ అని పేర్లు పెట్టినట్టు తెలిపారు. అయితే, ఈరోజు వాళ్లకు సంబంధించిన రేర్ ఫొటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.