దుబాయ్ వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో కీర్తి సురేష్ వివాహానికి సంబంధించిన పుకార్లు ఇటీవల వైరల్ అయ్యాయి . కీర్తి తండ్రి మరియు నిర్మాత జి సురేష్‌కుమార్ ఈ పుకార్లను అవాస్తవమని పేర్కొంటూ తీవ్రంగా తిరస్కరించారు.
మహానటి సినిమాతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తిసురేశ్. ఓ వైపు గ్లామరస్ పాత్రలు, మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. దుబాయ్ బిజినెస్ మెన్ ఫర్హాన్ బిన్ లియాఖత్ బర్త్ డే సందర్భంగా అతనితో కలిసి ఉన్న స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

కీర్తిసురేశ్ పెళ్లి వార్తలపై తండ్రి సురేశ్ కుమార్ క్లారిటీ
అటువంటి పుకార్లను నమ్మవద్దని మరియు కీర్తి గోప్యతను గౌరవించాలని ప్రజలను కోరడానికి సురేష్‌కుమార్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. కీర్తిసురేశ్‌ను ఒంటరిగా వదిలేయాలని సురేశ్ కుమార్ కోరారు. తన కూతురు పెళ్లి కుదిరితే.. ఆ విషయాన్ని మొదట తానే ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చేశారు.
సరైన సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవిత విషయాలను వెల్లడిస్తానని, అప్పటివరకు ఓపిక పట్టాలని రిలేషన్ షిప్ వార్తలపై కీర్తిసురేశ్ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. కీర్తిసురేశ్ ప్రస్తుతం భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రఘుతాత సినిమాతోపాటు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.