బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ 3’ ఈ మూవీ సెట్లో తాను గాయపడినట్టు సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ అభిమానులకి తెలియజేశారు. ప్రస్తుతం ‘టైగర్ 3’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ తర్వాత సూపర్ హిట్ టైగర్ తరహాలోనే లో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సందర్భంగా నటుడు సల్మాన్ తన బేర్ బ్యాక్ చిత్రాన్ని సోషల్ మీడియాఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో సల్మాన్ భుజం వెనుక భాగంలో భారీ కట్టు కట్టి ఉంది. ఈ ఫొటోతో పాటు “ప్రపంచపు బరువును మీ భుజాలపై మోస్తున్నట్టయితే బి కాసేపు ప్రపంచాన్ని పక్కన పెట్టి 5 కిలోల డంబెల్ ను ఎత్తి చూపించండి అనిచెప్పుకొచ్చాడు ,. దీనితో పాటు ‘టైగర్ జఖ్మీ హై’ అంటే పులి గాయపడింది అంటూ ‘టైగర్ 3’ హ్యాష్ ట్యాగ్ ను పెట్టాడు .
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ ఏంది దింతో అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని కోరుతున్నారు సల్మాన్ ఖాన్ అభిమానులు