Sara Ali Khan : బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ చిన్నది వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు టూర్ వేస్తుంటుంది. రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లి సందడి చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఖతర్ లో హడావిడి చేస్తోంది.

సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఖతార్‌లోని దోహాలో తన సన్నిహితురాలు అనన్య పాండేతో కలిసి సరదాగా గడుపుతోంది. ఈ బ్యూటీ తన హాలిడే ను ఎంజాయ్ చేస్తూనే గ్లామరస్ ఫోటోలతో నిరంతరం తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ కి ట్రీట్ ఇస్తోంది. సారా ఖతర్ లో చేసిన తాజా ఫోటో షూట్ లోని అందమైన ఫోటో లను పంచుకుంది. ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఐవరీ షరారా సెట్ ను ఎంచుకుంది. వైట్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ ఏంటో అందంగా కనిపించింది. డీప్ నెక్ లైన్ , థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో వచ్చిన బ్రాలెట్ వేసుకుని దాని పైన లాంగ్ ఓపెన్ కుర్తాను ధరించింది. ఈ టాప్ కి జోడిగా భారీ ఫ్రిల్స్ తో వచ్చిన షరారా ప్యాంట్ వేసుకుంది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సారా అలీ ఖాన్ పూల కుందన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తన రూపాన్ని స్టైల్ గా మార్చుకుంది.

