Avatar 2: హాలీవుడ్ లో జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2 ఎంత సెన్సేషన్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ తో తెరకెక్కిన ఈ మూవీ 12 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఇండియాలో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

దీనికి కారణం ఇండియాలో అవతార్ సినిమాని, అలాగే దర్శకుడు జేమ్స్ కెమరూన్ ని అభిమానించే వారు కోట్లాది మంది ఉంటారు. ఈ నేపధ్యంలో ఇండియాలో కూడా అవతార్ 2 సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే రిలీజ్ తర్వాత ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని సాదించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 2 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సాధించాయి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో అవతార్ మొదటి స్థానంలో ఉంటే అవతార్ 2 మూడో స్థానంలో ఉంది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారు 17 వేల కోట్ల వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో ఈ సినిమా ఏకంగా 390.60 షేర్ ని రాబట్టింది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ మూవీగా అవతార్ 2 మూవీ రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ మూవీ కూడా ఇండియాలో వంద కోట్ల షేర్ ని కూడా దాటలేదు.
అయితే అవతార్ 2 మూవీ మాత్రం చాలా ఈజీగా మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అవతార్ మూవీ మరి ఏ ఇతర హాలీవుడ్ సినిమా చేయని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఏకంగా 60.74 కోట్ల భారీ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా దాదాపుగా 55.49 కోట్ల లాభాలను ఈ మూవీ ద్వారా ఆర్జించారు.దీంతో డబ్బింగ్ చిత్రాలలో సెన్సేషన్ గా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది.