Lavanya Tripathi : సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. పసుపు పచ్చని అందాల లెహంగాను ధరించి కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి యూత్ కు పిచ్చెక్కిస్తోంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన అభిమానులను పలకరిస్తోంది.

లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ పిక్స్ ను లావణ్యతన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను లేటుగా చెప్పింది. లేటుగా అయినా లావణ్య లేటెస్ట్ లుక్స్ ను చూసి ఫ్యాన్స్ ఫీదా అయిపోతున్నారు.

లావణ్య త్రిపాఠి అర్చన జాజు కు మ్యూస్ గా వ్యవహరించింది. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఈ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ లెహంగా సెట్ ను ఎన్నుకుంది. మిర్రర్, థ్రెడ్ వర్క్ తో డీప్ నెక్ లైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజుల వేసుకుని దానికి మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ ప్రింట్స్,మిర్రర్ వర్క్ తో వచ్చిన హెవీ లెహంగాను వేసుకుంది. లెహంగా సెట్ కు మ్యాచింగ్ గా అదే ప్యాటర్న్స్ తో వచ్చిన దుపట్టాను వేసుకుంది.


ఈ ఎత్నిక్ వేర్ కు మ్యాచ్ అయ్యే విధంగా చెవులకు భారీ సిల్వర్ జంకాలను, మెడలో వెండి గొలుసును వేసుకుంది . ముక్కుకు ముక్కెర, నుదుటన పాపిటబిల్ల, చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంది. ఒక చేతికి బ్రాస్లెట్ ఇంకో చేతికి గాజులు వేసుకుని తన లుక్ ను మరింత గ్లామరస్ గా మార్చుకుంది. ఈ ఆభరణాలన్నింటిని ఎలివేట్ ప్రమోషన్స్ జ్యువెలరీ నుంచి సెలక్ట్ చేసుకుంది లావణ్య.
