జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. అసలు టీడీపీ కంటే ఎక్కువగాసి సీఎం జగన్ పైన, వైసీపీ పాలనపైన విమర్శలు చేస్తున్నారు. అస్సలు తగ్గేది లే అనే విధంగా పవన్ కళ్యాణ్ దూకుడుగా వైసీపీపై మాటలతో దాడి చేస్తున్నారు. ముఖ్యంగా తనపై అదే పనిగా విమర్శలు చేస్తున్న అంబటి రాంబాబు, రోజా, అమర్ నాథ్ లకి పవన్ కళ్యాణ్ గట్టిగా స్ట్రోక్స్ ఇస్తున్నారు. మాటలతో వారికి హీట్ పెంచుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓ వైపు వైసీపీ వైఫల్యాలని ఎండగడుతూనే, వారు తనపై అదే పనిగా చేస్తున్న విమర్శలకి కూడా తిరిగి కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నేను కూడా అలాగే విమర్శలు చేస్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో తన ప్రసంగం కొనసాగించారు. ఉత్తరాంద్ర అభివృద్ధి కోసం తాను ఏం చేస్తాను అనేది చెబుతూనే వైసీపీ నాయకులకి చెమటలు పట్టించారు.
అలాగే వైసీపీని అధికారానికి దూరం చేయడానికి తాను చేయబోతున్నది జనసేన శ్రేణులకి చెప్పే ప్రయత్నం చేశారు.మనకి గౌరవం తగ్గకుండా కోరుకున్న స్థాయిలో స్థానాలు ఇస్తే కలిసి పోటీ చేస్తామని లేదంటే ఒంటరిగానే ఎన్నికలకి వెళ్తామని చెప్పారు. ఇక రెండు పార్టీలు కలిసి వెళ్తే ఇక వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటు పవన్ కళ్యాణ్ కి పెరిగిన ఓటుశాతం, అలాగే గత ఎన్నికలలో వైసీపీ వెంట ఉన కాపు ఓటర్లు అందరూ తన వెంట నడిచే అవకాశం ఉంది.ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ని ఏదో ఒకటి చేసి టీడీపీకి దూరంగా ఉంచాలని చేసిన ప్రయత్నం విఫలం కావడంతో వైసీపీ టీమ్ భాగా హర్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఓటమి అప్పుడే కనిపించడంతో వైసీపీ నేతలు మూకుమ్మడిగా పవన్ పై మాటలతో దాడి చేయడం మొదలు పెట్టారు.
ఓ విధంగా చెప్పాలంటే జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఆవేశం మొత్తం వైసీపీ నాయకుల విమర్శలలో కనిపిస్తుందనే మాట వినిపిస్తుంది. వైసీపీ అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి విమర్శలు చేయాలి అనే అంశంపై స్క్రిప్ట్ రాగానే అదే పాయింట్స్ బేస్ చేసుకొని అందరూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. యువశక్తి సభకి వచ్చిన యువతని పవన్ కళ్యాణ్ అవమానించాడు అంటూ మొదలు పెట్టారు. తాను మిమ్మల్ని నమ్మడం లేదని తనకి సపోర్ట్ గా ఉన్న కార్యకర్తలకే చెప్పడం దారుణమని అన్నారు. అలాగే చంద్రబాబుకి అమ్ముడుపోయానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసాడని వైసీపీ నేతలు విమర్శలు చేయడం విశేషం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ విమర్శలు మాత్రం వైసీపీ నేతలని భాగా హర్ట్ చేశాయని చెప్పాలి.