ఏపీ రాజకీయ ముఖచిత్రంలో టీడీపీ పార్టీది తిరుగులేని ప్రస్థానం అని చెప్పాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీతో పాటు విభజన అనంతరం ఏపీకి చంద్రబాబు నాయుడు సేవలు అందించారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులతో చంద్రబాబు కలిసి ప్రయాణం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న తన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే కుట్ర రాజకీయాలకి చంద్రబాబు మొదటి సారి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే అసెంబ్లీలో అవమానానికి గురయ్యారు. చంద్రబాబుని వైఎస్ జగన్ ఎన్ని రకాలుగా మానసిక హింసకి గురిచేయాలో చేస్తున్నారు. మరో వైపు కుట్రలకి తెరతీస్తూ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుని ఓడించాలనే లక్ష్యం జగన్ రెడ్డి పెట్టుకున్నారు.
ఇది సాధ్యమయ్యే పని కాకపోయిన దౌర్జన్యం చేసి అయిన కుప్పంలో చంద్రబాబు గెలుపుని అడ్డుకోవాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు నుంచి దూరం చేయడానికి వైసీపీ అధిష్టానం అన్ని రకాల పాచికలు ప్రయోగిస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబుకి దగ్గర కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం వైసీపీ తీవ్ర స్థాయిలో చేస్తుంది అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ని అదే పనిగా రెచ్చగొట్టడం, అలాగే చంద్రబాబు టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టాలని సలహాలు ఇవ్వడం చేస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక స్పష్టమైన విజన్ తో ఉన్న వ్యక్తి అని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.
తన తర్వాత ఎవరిని తన స్థానంలో పెట్టాలి అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి దూరం కాలేదని తాజాగా తన ట్వీట్ తో మరోసారి ప్రూవ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై చంద్రబాబు చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. అందులో థాంక్యూ మామయ్యా అని చంద్రబాబుని ఉద్దేశించి తారక్ సంబోధించాడు. ఈ ఒక్క మాటతో చంద్రబాబు మీద తారక్ కి ఎంత అభిమానం ఉన్నది అర్ధమవుతుందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసిన తారక్ చంద్రబాబు వెంట ఉంటాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.