ఏపీ మంత్రి రోజా ఈ మధ్యకాలంలో చీటికి మాటికి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మంత్రి పదవి వచ్చిన తర్వాత టూరిజం సొమ్ముతో అన్ని జిల్లాలు తిరిగేస్తుంది. అస్సలు టూరిజం డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మానేసి తాను టూర్ లు తిరగడమే టూరిజం డిపార్ట్మెంట్ లో మినిస్టర్ గా తన బాధ్యత అని అనుకుంటుంది అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈమె రెగ్యులర్ గా తిరుమల దర్శనానికి వెళ్ళడం ఆలయం నుంచి బయటకి వచ్చిన తర్వాత నోటికి పని చెబుతూ ప్రతిపక్షాల మీద బూతులతో, లేదంటే పరుష పదజాలంతో విరుచుకుపడటం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద రోజా కామెంట్స్ చేసినట్లు వైసీపీలో ఎవ్వరూ చేయరని చెప్పాలి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్క రోజు రోజాపై ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఎలాంటి విమర్శలు చేయలేదు. జనసైనికులు రోజా మీద విమర్శలు చేసిన వాటిని వారించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో ఆమె మరింత శృతిమించిపోయి పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం అటు రాజకీయ వర్గాలలోని, ఇటు సినీ వర్గాలలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కి అస్సలు మానవత్వం, ఎమోషన్ లేదని, ఒక నటిగా అతనిని చూస్తే నాకు సిగ్గనిపిస్తుందని వ్యాఖ్యానించింది.
అక్కడితో ఆగకుండా మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు కూడా పిల్లికి కూడా బిక్షం వేసే రకం కాదని, అసలు ఫ్యాన్స్ ని కూడా వాడుకుంటూ ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాంటి వ్యక్తులు కాబట్టి ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సొంత నియోజకవర్గంలోనే ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇక నాగబాబుని కూడా దారుణంగా ఓడించి వారికి బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయాలకి మెగా ఫ్యామిలీ పనికిరారని ప్రజలు నిర్ణయించేశారు అంటూ తీవ్రంగా దూషించింది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారడంతో సినిమా వర్గాలలో కూడా మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గురించి తెలిసిన వారు రియాక్ట్ అవుతున్నారు.
ఏదో రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతూ చిరంజీవి గురించి కూడా కాస్తా అతిగా మాట్లాడారని, ఏదో లక్ష్యం కోసం ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉందని విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీ చేసే సాయం ఏంటి అనేది ఇండస్ట్రీలోనే కాకుండా బయట ఉన్న ఎంతో మందికి తెలుసని అన్నారు. ఇక నాగబాబు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రోజా ఒక డస్ట్ బిన్ లాంటిదని ఆమె నోట్లో నోరు పెడితే మళ్ళీ మనమే నోరు కడుక్కోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ మీద రోజా చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా జనసైనికులు, మెగా అభిమానులు ట్రోల్ చేస్తూ ఉన్నారు.