ఏపీలో వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి రోడ్ షోలు, ర్యాలీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సభలు పెట్టుకోవడంపై కూడా ఆంక్షలు విధించింది. సభలు నిర్వహించుకోవాలంటే అన్ని రకాల అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా, పార్కింగ్ ఉండే విధంగా, అలాగే ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయగలిగే ప్రాంతంలోనే సభలు నిర్వహించుకోవాలనే విధంగా కొత్త ఆంక్షలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సర్కారు ఆంక్షలు ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలపై కూడా పడ్డాయి.
ఒంగోలు సెంటర్ లో ఓ కాలేజీ మైదానంలో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దీనికి ఎప్పుడో డేట్ కూడా ఫిక్స్ చేసింది. అయితే ఈ కొత్త ఆంక్షల నేపధ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ సిటీలో నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సినిమా ఫంక్షన్ ని సిటీలో నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని, అలాగే పార్కింగ్ ప్రాబ్లమ్ అవుతుందని కారణం చూపిస్తూ సిటీ బయట పెట్టుకోవాలని సూచించారు.
ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఇప్పుడు వేదికపై పునరాలోచనలో పడింది. అలాగే విశాఖలో చిరంజీవి వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ని సాగరతీరంలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అయితే దీనికి కూడా పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీనికి కారణం బీచ్ రోడ్ లో పర్యాటకుల తాగికి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇబ్బంది అవుతుందని పర్మిషన్ రిజక్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. మొత్తానికి వైసీపీ సర్కార్ తనకి యాంటీ టీమ్ మొత్తాన్ని ఈ కొత్త ఆంక్షలతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.