Air India : విమాన ప్రయాణం అంటే ఎంతో క్లాస్ అని భావిస్తారు. కానీ అంతటి లక్సరీ ప్లేన్ లో నూ ఓ ప్రయాణికుడు చాలా చీప్ గా బిహేవ్ చేసి తోటి మహిళా ప్రయాణికురాలిని ఇబ్బంది పెట్టాడు. తప్పతాగి మహిళపై మూత్రవిసర్జన చేసి న్యూసెన్స్ చేసాడు. ఇంత జరిగినా అతడి చర్యకు ఎయిర్ ఇండియా సిబ్బంది అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో సదరు మహిళ ఎయిర్ ఇండియా ఛైర్మెన్ కు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

Air India : టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు మహిళ రాసిన లేఖ వెలుగులోకి రావడంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. అందులో సదరు మహిళ విమానంలో తన బాధాకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన సీటు వద్దకు వెళ్లి ప్యాంట్ విప్పి మూత్ర విసర్జన చేశాడని మహిళ ఆరోపించింది. మూత్రవిసర్జన తర్వాత, వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను బహిర్గతం చేయడం కొనసాగించాడని , ఇతర ప్రయాణీకులు అతన్ని వెళ్లి కూర్చోమని కోరినప్పుడు మాత్రమే కదిలాడు అని పేర్కొంది . మహిళ బట్టలు, బూట్లు ,బ్యాగ్ మూత్రంలో తడిసిపోయాయని , సిబ్బంది ఆమెకు కొత్త బట్టలు ఇచ్చారని పేర్కొంది. అయితే ఆమె మూత్రంతో తడిసిన సీటుపై కూర్చోనని తెలపడం తో సిబ్బంది సీట్ ను కేటాయించారంది. ఆ తర్వాత మల్లి తన సీట్ పైన షీట్లు వేసి కూర్చోమని తెలిపారన్నారు. అయితే తానూ నిరాకరించానని తెలిపింది. ఇంత జరిగిన ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బిజినెస్ క్లాస్ లో సీట్ లు ఉన్న తనకు ఇవ్వలేదని పేర్కొంది. అతనిపై యాక్షన్ తీసుకోమని క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణీకుడు దర్జాగా వెళ్లిపోయాడని ఆమె చెప్పింది.
అయితే ఈ ఇన్సిడెంట్ పైన ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనను తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, మొదటి దశగా, ప్రయాణీకుడిపై 30 రోజుల పాటు నిషేధం విధించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఎయిర్‌లైన్ సిబ్బందిలో లోపాలను పరిశోధించడానికి పరిస్థితిని త్వరగా పరిష్కరించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
Advertisement