పాలకొల్లు కేంద్రంగా సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకి దిగిన సంగతి తెలిసిందే. అయితే అతని దీక్షని పోలీసులు భగ్నం చేసి, అరెస్ట్ చేసి, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేగొండి హరిరామజోగయ్య పోరాటానికి మద్దతు తెలుపుతూ కాపు నాయకులూ పెద్ద ఎత్తున ఏలూరులో హాస్పిటల్ లో వెళ్ళారు. వారిని లోపలికి అనుమతించకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తూ హరిరామజోగయ్య జోగయ్య దీక్షని ఆపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే హరిరామజోగయ్య జోగయ్యని పరామర్శించి మద్దతు ఇవ్వడానికి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాస్పిటల్ కి వెళ్ళారు. అయితే అక్కడ పోలీసులు కాస్తా అతిగా ప్రవర్తించారు. కనీసం మాజీ ఎమ్మెల్యే అనేది కూడా చూడకుండా చింతమనేని షర్ట్ పట్టుకొని బలవంతంగా తీసుకెళ్ళి జీపులో నెట్టేసి అరెస్ట్ చేశారు. ఈ పెనుగులాటలో చింతమనేని షర్ట్ చినిగిపోయింది. ఇక పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేసిన తర్వాత ఆయన నేరుగా అమరావతిలోనే పార్టీ కార్యాలయానికి చేరుకొని పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలతో కొంత మంది పోలీసులు మరీ శృతిమించి ప్రవర్తిస్తున్నారని చింతమనేని విమర్శలు చేశారు.
తనని అంత బలవంతంగా షర్టు చినిగిపోయేలా నెట్టుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో పోలీసులు ఇప్పటి వరకు చెప్పలేదని అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్న హరిరామజోగయ్య పరామర్శించడం నేను చేసినా తప్పా అంటూ ప్రశ్నించారు. ఇలాగే టీడీపీ నాయకులని లక్ష్యంగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన భయపడేది లేదని అన్నారు. కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
Advertisement