ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు మొదలు పెట్టడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు కీలక నేతలు, అది కూడా జనసేన పార్టీకి చెందిన మాజీలు బీఆర్ఎస్ లో చేరబోతూ ఉండటం సంచలనంగా మారింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీలని లక్ష్యంగా చేసుకొని వైసీపీకి ఫేవర్ చేయడానికి రాజకీయాలు చేస్తుందనే టాక్ వచ్చింది. వైసీపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అనే మాట కూడా వినిపించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని టాక్. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్ధసారధి జనసేన పార్టీలో పోటీ చేసిన వారే కావడంతో అందరూ జనసేనని బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుందని అందరూ భావించారు.
అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న రావెల కిషోర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని అన్నారు. మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని, ఇదొక పనికిమాలిన ఆలోచన అని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గొప్ప రాజధానిని నిర్మిస్తామని అన్నారు. అలాగే బీజేపీ పార్టీ అధికారులతో తమ ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ దారికి తెచ్చుకోవాలని భావిస్తుందని ఆరోపించారు. అలాగే టీడీపీపై కూడా విమర్శలు చేశారు. జనసేన ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.
అలాగే తోట చంద్రశేఖర్ మెగా ఫ్యామిలీకి భాగా కావాల్సిన వ్యక్తి. ఐఎఎస్ అయినా కూడా మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ప్రజారాజ్యం ద్వారా రాజకీయాలలోకి వచ్చారు. జనసేన పెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. వైసీపీలో గెలిచే అవకాశం ఉన్న కాదనుకొని పవన్ తో కలిసారు. ఉన్నపళంగా జనసేనని వీడి బీఆర్ఎస్ లో చేరడంతో పాటు ఆ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలని చంద్రశేఖర్ తీసుకుంటున్నారు. దీనిని బట్టి జనసేన, బీఆర్ఎస్ కలిసి ఎన్నికలకి వెళ్ళే ఛాన్స్ ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. టీడీపీతో కలిసి వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్న నేపధ్యంలో బీజేపీకి దూరమై బీఆర్ఎస్, జనసేన ఉమ్మడిగా ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నంలో చేస్తుందని. పవన్ కళ్యాణ్, కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు బోగట్టా.