గత కొంతకాలంగా టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్స్ పవిత్రా లోకేష్, నరేష్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి రిలేషన్ పై చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇష్టారీతిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక నరేష్ మూడో భార్య కూడా మీడియా ముందుకి వచ్చి వీరిద్దరి రిలేషన్ ని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పవిత్ర లోకేష్, నరేష్ తమపై జరుగుతున్న ట్రోల్స్ దాడిపై సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. కొన్ని యుట్యూబ్ చానల్స్ పనిగట్టుకొని తమపై తప్పుడు రాతలు రాస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నామని వీడియో ద్వారా తెలిపారు. కేక్ కట్ చేసుకొని ఒకరికిఒకరు తినిపించుకున్నారు. తరువాత లిప్ కిస్ పెట్టుకొని అఫీషియల్ గా తమ రిలేషన్ ని కన్ఫర్మ్ చేశారు. త్వరలో పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాం అంటూ వీడియోలో స్పష్టం చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఇక నరేష్, పవిత్ర లోకేష్ కి సోషల్ మీడియాలో చాలా మంది విశేష్ చెబుతున్నారు.
నరేష్ కి ఇప్పటికే మూడు సార్లు పెళ్లి జరిగింది. ఇక పవిత్ర లోకేష్ కి ఇది రెండో వివాహం అని తెలుస్తుంది. ఆమెకి మొదటి భర్తతో పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరి రిలేషన్ కారణంగా ఇప్పటికే ఆమె అఫీషియల్ గా విడాకులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నరేష్, పవిత్రా లోకేష్ తమ రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్తాం అని చెప్పడం ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చారు.
Advertisement