ఏపీ రాజకీయాలలో ఈ ఏడాది ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అధికార పార్టీ తన రాజకీయ వ్యూహలాతో ప్రజలకి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తూనే ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టె ప్రయత్నం కూడా చేసింది. ఇలా రకరకాల రాజకీయ సంఘటనలతో ఏపీలో ఈ ఏడాది రాజకీయం వేడెక్కింది అని చెప్పాలి. రాబోయే ఎన్నికలలో ఫలితాలని ఈ ఏడాది జరిగిన సంఘటనలు కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎంపీ గోరంట్ల మాధవ్ అర్ధనగ్న వీడియో కాల్ బయటకి వచ్చి వైరల్ అయ్యింది. ఆ వీడియో ఏపీలో పెద్ద దుమారమే రేపింది. ప్రతిపక్షాలు అధికార పార్టీని, అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్ ని టార్గెట్ చేయడానికి అదొక ఆయుధంగా వాడుకుంది. తరువాత కోనసీమ అల్లర్లు ఏపీలో సంచలనంగా మారాయి.
కోనసీమలో వైసీపీ ఎంపీ ఇళ్ళుని కొంతమంది దగ్ధం చేశారు. ఈ ఘటన కోస్తా జిల్లాలలో సంచలనంగా మారింది. అయితే కాపు వర్గానికి చెందిన చాలా మంది ఈ అల్లర్లలో ఉన్నారు. కాని వైసీపీ ప్రతిపక్షాలని, ముఖ్యంగా జనసేన పార్టీని కోనసీమ అల్లర్లకి బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేసింది. సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్ తో ఉద్యోగ సంఘాలు చలో విజయవాడకి పిలుపునిచ్చాయి. అయితే ఉద్యోగులని ఈ విజయవాడ రాకుండా ఆపడంలో పోలీసులు వైఫల్యం చెందారు. విజయవాడలో ఈ చలో విజయవాడతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైసీపీపై ఉద్యోగ సంఘాలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఈ ఘటన చూపించింది. ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంత్ బాబు తన మాజీ డ్రైవర్ ని బయటకి తీసుకెళ్ళి కొట్టి చంపేసాడు.
తరువాత ఇంటికి అప్పగించే ఇదో కథ చెప్పాడు. ఈ ఘటనపై మూడు రోజుల వరకు పోలీసులు అనంత్ బాబు మీద కేసు ఫైల్ చేయలేదు. ప్రతిపక్షాల ఆందోళన తర్వాత ఒత్తిడి పెరగడంతో ప్రజా వ్యతిరేకతని తగ్గించుకోవడానికి అనంత్ బాబుని అరెస్ట్ చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ హోటల్ నుంచి బయటకి రాకుండా నిర్భందించింది. అదే సమయంలో మంత్రులపై దాడి చేసారని జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ రాత్రికి రాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
ఇక పల్నాడులో టీడీపీ నాయకులని లక్ష్యంగా చేసుకొని వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడులు చేశారు. మాచర్లలో టీడీపీ ఇన్ చార్జ్ ఇంటిని దగ్ధం చేశారు. చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో కందుకూరులో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ సభకి భూములు ఇచ్చారనే కోపంతో రోడ్డు విస్తరణ సాకు చూపిస్తూ సామాన్యుల ఇళ్ళు కూల్చేశారు. అలాగే విశాఖలో రుషికొండపై భవనాల నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
అమరావతి రైతుల మహా పాదయాత్ర జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై ఉద్యమం నడుస్తుంది. జిల్లాల పునర్విభజన తో 13 జిల్లాలని 26గా మార్చారు. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది. వైసీపీ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టింది. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేస్తుంది. టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మరా రాష్ట్రానికి అనే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇలా ఎలా ఏపీలో జరిగిన రాజకీయ పరమైన ఘటనలలో ఏపీలో ఈ ఏడాదిలో ఎన్నికల వేడి కనిపించింది.
Advertisement