Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ , సన్నిహిత మిత్రులతో కలిసి నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి విహారయాత్ర కోసం అబుదాబికి వెళ్ళింది. అందమైన హాలిడే డెస్టినేషన్ నుండి చిత్రాల ను వీడియోలను నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

ప్రశాంతమైన సన్నీ బీచ్ నుండి ఆమె చేసిన తాజా పోస్ట్ ఇంటర్నెట్‌లో మంటలను రేపింది. చిత్రంలో, మౌని నలుపు రంగు స్విమ్‌వేర్ ధరించింది. ఈ బికినీ కి ఒక జత నల్లటి సన్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో డ్రింక్ పట్టుకుని . కెమెరా కు హాట్ పోజులు ఇచ్చింది. ఈ పిక్ కింద మౌని అందమైన క్యాప్షన్ జోడించింది.

అంతకు ముందు మౌని రాయ్ నురై ద్వీపం నుండి గ్లింప్స్‌తో కూడిన కలర్ ఫుల్ పిక్స్ ను పోస్ట్ చేసింది. మొదటి రెండు చిత్రాలలో, ఆమె చురుకైన ఆకుపచ్చ దుస్తుల్లో రాక్ చేసింది.

తన అమ్మాయి గ్యాంగ్‌తో హాలిడే ను అబుదాబిలో చల్లగా ఎంజాయ్ చేస్తోంది మౌని . సూరజ్ నంబియార్ తన స్నేహితులతో ఉన్న పిక్స్ ను పెట్టి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

మౌని రాయ్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ మూవీస్ తో కన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారారే చాలా ఫేమస్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్ ను చేస్తూ ఫ్యాషన్ లక్ష్యాలను అభిమానులకు అందిస్తుంటుంది మౌని. క్యాజువల్ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ దుస్తుల వరకు ఈ బ్యూటీ ఏ అవుట్ ఫిట్ లో కనిపించిన అదరగొడుతుంది అని అంటుంటారు ఫ్యాన్స్.

మౌని రాయ్ ఒక భారతీయ టీవీ నటి గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. హిందీ టెలివిజన్‌లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ సీరియల్ తో 2006 లో తొలిసారిగా నటించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నాగిన్ దాని సీక్వెల్ నాగిన్ 2 లో తన షాప్స్ ను చూపిస్తూ, ఆకారాన్ని మార్చే సర్పంగా నటించిన తర్వాత రాయ్ అత్యధిక పారితోషికం పొందే హిందీ టెలివిజన్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది.

ఈ బ్యూటీ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ మరియు గోల్డ్ అవార్డ్స్‌తో సహా పలు అవార్డులను పొందింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నూ పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.