Alaya F : అలయ ఎఫ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాల్లోనే నటించినా, ఆమె తన ఆన్-స్క్రీన్ ప్రదర్శనలతో ,హాట్ ఫోటో షూట్ తో తనదైన ముద్ర వేసుకుంది. అభిమానుల దృష్టిని ఆకర్షించడం లో ఈ భామది అందె వేసిన చెయ్యి . ఈ బ్యూటీ అనేక ఉత్తమ దుస్తులను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

అలయ వివిధ ఈవెంట్‌లలో లేదా సాధారణ విహారయాత్రలకు హాజరయ్యేందుకు క్లాసిక్ అవుట్ ఫిట్స్ ను ఎన్నుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మినిమల్ మేకప్‌తో స్టైల్ చేసిన న్యూడ్ కటౌట్ మినీ డ్రెస్ తో హాట్ ఫోటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.

అలయ ఎఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోషూట్ చిత్రాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ తో తన అభిమానులను ఆనందపరిచింది అలయ ఎఫ్ . ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ డిజైనర్ దుస్తుల లేబుల్ మన్నత్ గుప్తా షెల్ఫ్‌ల నుండి ఈ న్యూడ్ కలర్ అవుట్ ఫిట్ తో అలయను స్టైల్ చేశాడు. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సింపుల్ ఉపకరణాలు , అలంకరణతో స్టైల్ చేసుకుంది. అలయ అభిమానులు ఈ స్టైల్ మూమెంట్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. స్టార్‌ను ప్రశంసిస్తూ అనేక కామెంట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో వదులుతున్నారు.

హాల్టర్ నెక్‌లైన్, వెనుక రిబ్బన్ టై క్లోజర్, నడుముపై కట్-అవుట్ ఆమె టోన్డ్ మిడ్‌రిఫ్, అమర్చిన బస్ట్, అసమాన మినీ-లెన్త్ హెమ్‌లైన్ ర్యాప్‌ఓవర్ తో వచ్చిన స్లీవ్‌లెస్ న్యూడ్-కలర్ డ్రెస్‌లో అదిరిపోయింది.

అలయ చేతి వేళ్ళకి స్టేట్‌మెంట్ గోల్డ్ రింగ్‌లు, హూప్ చెవిపోగులు న్యూడ్ మినీ డ్రెస్‌ను యాక్సెస్ చేయడానికి కిల్లర్ హై హీల్స్ ను జత చేసింది. గ్లామ్ పిక్స్ కోసం, గజిబిజి పోనీటైల్ వేసుకుంది. పెదాలకు న్యూడ్ మావ్ లిప్ షేడ్, కనులకు సూక్ష్మమైన ఐ షాడో వేసుకుని కుర్రాళ్లను మెస్మెరైజ్ చేసింది.
