PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున యూఎన్ మెహతా హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణవార్త తెలుసుకున్న ప్రధాని ట్విట్టర్ వేదికగా భావోద్వేగమైన మెసేజ్ ను పోస్ట్ చేశారు. అనంతరం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.

రెండు రోజుల క్రితమే అనారోగ్య సమస్యలతో హీరాబెన్ మోదీ అహ్మదాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చేరారు. తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న గురువారం ప్రధాని అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి చేరుకుని గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పినప్పటికి ఇవాళ తెల్లవారుజామున ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. దీంతో హుటాహుటిన నరేంద్ర మోదీ తన తల్లికి దగ్గరకు చేరుకున్నారు. మార్గమధ్యలోనే తన తల్లికి సంబంధించి ఓ భావోద్వేగమైన మెసేజ్ ను మోదీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

తన తల్లి జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిదని అన్నారు మోదీ . ఆమె జీవించిన వందేళ్లు నిస్వార్థంగా విలువలతో బ్రతికారన్నారు. ఆమెలోని నాకు త్రిమూర్తులు కనిపిస్తారని మేధస్సుతో పని చేసి స్వచ్ఛతతో జీవితాన్ని గడిపిన మహోన్నతురాలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇదిలా ఉండగా మోదీ తల్లి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ,బహుజన్ సమాజ్ పార్టీ అధినేతతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నివాళులు అర్పించారు. తాజాగా ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి
హీరాబెన్ మోదీ మరణ వార్త తెలియగానే దేశ వ్యాప్తంగా నివాళులర్పించారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

తాజాగా హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మోదీ తన తల్లి పాడెను మోసి అంత్యక్రియలను నిర్వహించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మోదీ మోమును చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్ లోని ముక్తిధామ్ శ్వశాన వాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హీరాబెన్ అంత్యక్రయల్లో పాల్గొనేందుకు బీజేపీ పార్టీ శ్రేణులు మోదీ అభిమానులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.