New Delhi : ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగి , ఆరోగ్య కరమైన ఆహారం గురించిన అవగాహనా పెరగడంతో చాలామంది విపరీతమైన డైటింగ్ లు చేస్తూ ఒళ్ళు తగ్గించుకునే పనిలో మునిగి పోయారు. సాధారణ ప్రజలే కాదు పోలీసులు డైటింగ్ ట్రిక్స్ ఫాలో అవుతూ హెవీ బాడీ ని కాస్త జిమ్ బాడీ గా మార్చేస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఓ పోలీస్ బాసు కూడా తన భారీ కాయాన్ని డైటింగ్ తో తగ్గించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

130 కిలోల బరువున్న ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ జితేంద్ర మణి పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు , పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు అధికారి ఆరోగ్యాన్ని నిరంతరం ప్రమాదంలో పడే సాయి. లగే ఉంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో అని ఆందోళన చెందిన జితేంద్ర డైట్ ఫాలో అయ్యి ఎనిమిది నెలల్లో 46 కిలోల బరువు తగ్గారు. ఇంట తక్కువ సమయంలో జితేంద్ర లో మార్పు రావడంతో పోలీసు కమిషనర్ రివార్డ్ ఇచ్చారు.

తన జీవితాన్ని మలుపు తిప్పాలని నిర్ణయించుకున్న ఆ అధికారి తన జీవనశైలి అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. అతను ప్రతిరోజూ 15,000 అడుగుల దూరం నడవడం , ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. నేను రోటీలు , అన్నం తో పాటు అధిక కార్బోహైడ్రేట్ ఆహారం వీడి సూప్‌లు, సలాడ్‌లు , పండ్లు వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నని జితేంద్ర తెలిపారు.
కఠినమైన ఆహారాన్ని అనుసరించి, కేవలం ఎనిమిది నెలల్లో, అతను తన నడుము సైజు ను 12 అంగుళాలు కోల్పోయాడు , అతని కొలెస్ట్రాల్ స్థాయిలను ఐదవ వంతు తగ్గించాడు. ప్రతి నెలా 4.5 లక్షల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని . గత 8 నెలల్లో, నేను 32 లక్షల మెట్లు నడిచాను అని తన బరువు ఇప్పుడు 84 కిలోలు అని మణి చెప్పారు.
90,000 మందికి పైగా పోలీసులు హాజరైన వేడుకలో పోలీసు శాఖ తరపున అతనికి ప్రశంసా పత్రాన్ని అందించారు. పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా అతని కృషిని అభినందించారు.