ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైసీపీలో అసమ్మతి స్వరం బయటకి వస్తుంది. ఇన్ని రోజులు నియంతృత్వంగా నేను ఏం చెబితే అదే ఎమ్మెల్యేలు అందరూ తందానా అంటూ అనాలి అనే విధంగా జగన్ రెడ్డి పాలనా విధానం ఉంది. సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎమ్మెల్యేలని, కనీసం సంబందిత మంత్రులని కూడా ఇన్వాల్వ్ చేయకుండా చేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలలోనే డబ్బులు జగన్ వేస్తూ వస్తున్నారు. దానికోసం వాలంటీర్లని పెట్టుకున్నారు. ఒక్క సంక్షేమం తప్ప అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసారు. రోడ్లు, త్రాగు, సాగు నీటి ప్రాజెక్ట్స్ ఊసే లేదు. నూతన విద్యావిధానం అంటున్న ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ నిర్వహించలేదు. అలాగే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అని చెప్పిన దాని ఊసేలేదు. ఇలా విద్యా, ఉపాధి, అభివృద్ధి అనేవి జగన్ పాలనలో ఎక్కడా కనిపించడం లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ.
ఇప్పుడు సంక్షేమ పథకాలలో పెన్షన్ లబ్దిదారులలో ఏవో సాకులు చూపించి కొత్త విధిస్తున్నారు. ఈ నేపధ్యంలో మెల్లగా వైసీపీ నాయకులలో జగనన్న పాలనపై అసమ్మతి స్వరం మొదలైంది. మొన్నటి వరకు గ్రామ స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్తాయిలో సెకండ్ క్యాడర్ నాయకులలో అసమ్మతి వినిపిస్తూ ఉండేది. నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఉన్న అది పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అయితే తాజాగా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నేరుగానే జగన్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లా సమావేశంలో అసమ్మతి స్వరం వినిపించారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేసామని ప్రజలదగ్గరకి వెళ్లాలని ప్రశ్నించారు. కనీసం త్రాగునీరు ఇవ్వలేకపోయాం, రోడ్లు వేయలేకపోయాం.
అభివృద్ధి చేయలేకపోయాం. ఏదో పథకాల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తే గెలుస్తామా? గత ప్రభుత్వం కూడా ఇచ్చింది ప్రజలు మళ్ళీ గెలిపించారా? అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఏం చేసామని ప్రజలు అడుగుతున్నారు. కనీసం నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే నెల్లూరులో పార్టీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆనం కూడా జగన్ పై కాస్తా అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన నేరుగానే పుబ్లిక్ గా జగన్ రెడ్డి పాలనపై విమర్శలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు వేచి చూడాలి.