బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో ప్రతి ఎపిసోడ్ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండే విధంగా ఆహా టీమ్ భారీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో స్టార్ట్ చేయగా అది పెద్ద హిట్ అయ్యింది. రాజకీయ వర్గాలలో కూడా సంచలనంగా మారింది. ఇక మరో ఊడు రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాలయ్య హోస్ట్ గా ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.
దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు అనే న్యూస్ పెను సంచలనంగా మారింది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ మంగళవారం జరిగింది. ఇక ఈ షూటింగ్ కూడా పెను సంచలనంగా మారింది. అటు సినీ వర్గాలలో, ఇటు రాజకీయ వర్గాలలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్, హడావిడి సైతం న్యూస్ చానల్స్ లైవ్ కవరేజ్ చేసాయి అంటే ఎ స్థాయిలో సంచలనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అల్లు అరవింద్ కూడా మీడియా సమావేశం పెట్టి మరీ ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. ఇక షో షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. ఇక షోలో హోస్ట్ గా ఆసక్తికరమైన ప్రశ్నలు ఎన్నో పవన్ కళ్యాణ్ ని అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఒక ఎంటర్టైన్మెంట్ షో అయినా కూడా దీనిపై వైసీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ గుస్సా అయ్యారు.
అదే పనిగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ ని హోస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తే టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అన్నంతగా హడావిడి చేసి ట్విట్టర్ లో విమర్శలు చేయడం మొదలు పెట్టి పేర్ని నాని లాంటి వారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇక లైవ్ డిబేట్ లో కూడా వైసీపీ నాయకుల ఇబ్బంది అడుగడుగునా కనిపించింది. దీనిని బట్టే జనసేన, టీడీపీ కలయికపై వైసీపీ ఎంత టెన్షన్ పడుతుంది అనేది అర్ధం అవుతుందని రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.