Rashmika Mandanna : సౌత్ బ్యూటీ రష్మిక మందన్న సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలతో రోజూ ఫిదా చేస్తూనే ఉంటుంది. ప్యాంట్‌సూట్ లు , సాధారణ వస్త్రధారణ నుంచి ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ వరకు, రష్మికకు తన ఫ్యాషన్ డైరీలతో ఫ్యాన్స్ హృదయాలను ఎలా గెలుచుకోవాలో బాగా తెలుసు. లేటెస్ట్ గా ఈ కన్నడ బ్యూటీ ఎత్నిక్ అవుట్ ఫిట్ తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ లుక్స్ లో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

తాజాగా రష్మిక చేసిన ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాకు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ డిజైనర్ షెల్ఫ్ నుండి పండుగ దుస్తులను ఎంచుకుని హాట్ లుక్స్ తో ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

స్లీవ్‌లెస్ వివరాలు కోసెట్ ప్యాటర్న్‌లతో ఐవరీ వైట్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజ్ ను రష్మిక వేసుకుంది. ఆమె దానికి జోడిగా షరారాను వేసుకుంది. ఈ రెండింటి పైకి సరిహద్దుల వద్ద జరీ వివరాలు కలిగిన ఐవరీ వైట్ లేస్ ష్రగ్ ను ధరించింది రష్మిక . ఈ లుక్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ బ్యూటీ.

ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ రష్మికకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. రష్మిక తన కురులతో అందమైన హెయిర్ స్టైల్ వేసుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మస్కరా వేసుకుని కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన లుక్ ను పూర్తి చేసింది.

రష్మిక ఫార్మల్ ఫ్యాషన్ డైరీలు కూడా అంతే అట్ట్రాక్టీవ్ గా ఉంటాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ తెల్లటి ప్యాంట్‌సూట్ వేసుకుని బాస్ లుక్ లో అదరగొట్టింది. తన క్రేజీ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

వైట్ కోట్, అదే రంగులో ఉన్న ఫార్మల్ ప్యాంటు వేసుకుని నడుముకి బ్లాక్ బెల్ట్ జతచేసింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెరిసేటి నల్లటి ఫుట్ వేర్ వేసుకుని రష్మిక తన రూపాన్ని పూర్తి చేసింది.
