UK : ఈ మధ్యకాలంలో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పెట్స్‌ను ఎంతో ప్రేమగా పెంచేసుకుంటున్నారు. సొంత పిల్లల కన్నా ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ వాటి ఆలనా పాలన చూసేవారు లేకపోలేదు. కుక్కలు కూడా తమ యజమాని పట్లు విశ్వాసంతో ఉంటూ వారికి రిలాక్సేషన్‌ను అందిస్తున్నాయి. అయితే యూకేలో ఉన్న ఓ కుక్క చేసిన చిలిపి పనికి ఆ ఇళ్లు మాడి మసైంది. ఓనర్‌కు పట్టపగలే చుక్కలు చూపించింది.

అసలు విషయానికి వస్తే డిసెంబరు 24న కుక్క ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ హెయిర్‌డ్రైర్‌ని ఆన్ చేయడంతో యూకేలోని హాక్లీలో ఓ ఇంట్లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. పొగతో నిండిన ఇంటి గురించిన నివేదికలు అందడంతో ఎసెక్స్ ఫైర్ సర్వీస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎసెక్స్ ఫైర్ సర్వీస్ ప్రకారం, ఒక మహిళ తన పెంపుడు కుక్కను ఇంట్లో వదిలి బయటికి వెళ్లింది. ఆమె తిరిగి
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తన ఇల్లు చూసి షాక్ కు గురైంది. ఇల్లంతా పొగతో నిండిపోవడంతో అవాక్కయ్యింది ఆ సదరు మహిళ కుక్క తలుపు బయట కూర్చున్నట్లు గుర్తించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందని మొదట ఆందోళన పడినా ఈ సదరు మహిళ మంచం పైన ఉంచిన హెయిర్ డ్రయ్యర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. సదరు పెంపుడు కుక్క తనకు తెలియకుండానే మంచంపైకి దూకిందని అలా హెయిర్ డ్రయ్యర్ ఆన్ అవ్వడం వల్లే మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఆ మంటలు చివరికి ఇళ్లంతా వ్యాపించాయని భావిస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాక్లీకి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు
ఈరోజు హాక్లీలో ఘోర ప్రమాదం సంభవించిందని సోషల్ మీడియాలో కాలిన ఇంటి పిక్స్‌ను పోస్ట్ చేశారు. ఒక కుక్క మంచం మీద దూకి హెయిర్ డ్రయ్యర్‌ని ఆన్ చేసింది, అలా మంటలు చెలరేగి ఇంటిని కాల్చిందని పేర్కొన్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ ఉపకరణాలను వాడిన తరువాత వెంటనే వాటని అన్‌ప్లగ్ చేయాలని సూచించారు అధికారులు.

అయితే తన కుక్క హెయిర్‌డ్రైర్‌ను ఆన్ చేస్తుందని ఇంటి యజమాని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని, కానీ ఏదైనా అన్‌ప్లగ్ చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది అని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుతం కుక్క యజమానికి , కుక్కు స్మోక్ ఇన్‌హాలేషన్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.