ఏపీలో వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి చంద్రబాబు మరో వ్యూహాత్మక ఆలోచనతో ముందుకి వెళ్తున్నారు. దానికి ఇప్పటికే అమల్లో పెట్టారు. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వైసీపీకి ఎలాగూ దూరం అవుతుందని నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గ ఓటర్లని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బీసీ సభలు జిల్లాల వారీగా నిర్వహించడం మొదలు పెట్టారు. బీసీలకి జగనన్న ప్రభుత్వంలో పెద్దపీట వేశామని చెప్పడానికి ఆ సామాజిక వర్గ మంత్రులతో సభ నిర్వహించి వారితో బీసీలకి వైసీపీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభలు కూడా నిర్వహిస్తామని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.
దీనిని బట్టి వైసీపీ ఫోకస్ అంతా ఇప్పుడు చౌదరి, కాపు సామాజిక వర్గాలు తప్ప మిగిలిన అందరిపై ఉందని అర్ధమవుతుంది. అయితే వైసీపీ వ్యూహానికి చంద్రబాబు ప్రతి వ్యూహం సిద్ధం చేశారు. ఒక్క సొంత సామాజిక వర్గానికి తప్ప మరి ఏ ఇతర వర్గాలకి వైసీపీ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. జగన్ సర్కార్ లు ఉన్న సలహాదారులలో మెజారిటీ వర్గం రెడ్లు ఉన్నారని చూపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన పోలీస్ అధికారులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అని చెబుతున్నారు.
అలాగే కలెక్టర్స్, విశ్వ విద్యాలయాలలో వైస్ చాన్స్ లార్స్ కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే ఉన్నారని లెక్కలు, పేర్లతో సహా చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రధాన మంత్రి పదవులు, అలాగే కీలక పదవులు అన్ని కూడా జగన్ సొంతం సామాజిక వర్గానికి ఇస్తూ మిగిలిన వారికి ఏదో ముష్టి వేసినట్లు వేసారని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ లో రెడ్లకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారని, ఎలాంటి అధికారం లేని సామంత రాజుల తరహాలో పోస్టులు ఇతర వర్గాల వారికి ఇస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. అలాగే మిగిలిన టీడీపీ మెయిన్ లీడర్స్