గత మూడేళ్ళుగా అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం అమరావతి రైతుల ఉద్యమం టీడీపీ నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమం మాత్రమే అని విమర్శలు చేస్తున్నారు. అస్సలు అమరావతి రైతుల ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆ ఉద్యమాన్ని ఎలా అయినా నీరుగార్చేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టె విధంగా మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అనే అజెండాని తెరపైకి తీసుకొచ్చి వైసీపీ నాయకులతో రాయలసీమ, ఉత్తరాంద్రలో నిరసన సభలు నిర్వహించేలా చేశారు. అయితే ఈ సభలు పూర్తిగా వైసీపీ సహకారంతోనే జరిగాయనే విషయం రాష్ట్రంలో ఉన్న అందరికి తెలుసు. విశాఖని రాజధాని చేయమని ఉత్తరాంద్ర ప్రజలు ఎవ్వరూ కోరుకోవడం లేదు.
కేవలం వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ ఆర్ధిక సహకారంతో పనిచేసే జేఏసీలు మాత్రమే డిమాండ్ చేస్తున్నాయి. అయితే మీడియాలో కొన్ని వైసీపీ సపోర్ట్ చానల్స్ ఆ ఉద్యమం మొత్తం ఉత్తరాంద్ర ప్రజల హక్కుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాయలసీమలో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందుతుంది అనే వింత వాదనని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ ఉద్యమాలు కేవలం వైసీపీ ఆర్ధిక సహకారంతో జరిగినవే కావడంతో కొద్ది రోజులకి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇక అమరావతి ఉద్యమం మాత్రం కొనసాగుతుంది. అమరావతి రైతుల పాదయాత్రకి అధికార వైసీపీ ఏవో ఒక కారణాలు చూపిస్తూ, వైసీపీ నాయకులతో వారు పాదయాత్ర చేసే జిల్లాలలో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో హై కోర్టు అమరావతి రైతుల పాదయాత్రకి కొన్ని కండిషన్స్ పెట్టి అవకాశం ఇచ్చిన కొద్ది రోజులు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో రైతుల ఉద్యమంలో చేస్తున్న రైతు సంఘాలతో కలిసి అమరావతి రైతుల ఉద్యమాన్ని మరోసారి గట్టిగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అమరావతి రాజధాని కట్టకుండా మూడు రాజధానులు అంటూ జగన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ అట కారణంగా ఏపీకి మూడు లక్షల కోట్ల నష్టం వచ్చిందని అన్నారు.
అది కూడా అమరావతి రాజధాని అభివృద్ధికి రావాల్సిన నిధులు అన్ని కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు. కనీసం ప్రతి నెల ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుంది అంటే ఎలా నమ్ముతారని ప్రజలని ప్రశ్నించారు. మూడు రాజధానుల డ్రామాతో వైసీపీ ప్రజలని, రైతులని నిలువునా మోసం చేస్తుందని బొబ్బిలిలో జరిగిన రోడ్ షోలో పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేది తెలుగుదేశం నినాదం. రాజధాని ఒకటి, అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతం అని పేర్కొన్నారు.