Shehnaaz Gill : మోడరన్ అవుట్ ఫిట్స్ తో మాయ చేయాలన్నా ఎత్నిక్ లుక్స్ తో మెస్మరైజ్ చేయాలన్న అది బాలీవుడ్ బ్యూటీ షెహ్నాజ్ కౌర్ గిల్ కె సాధ్యం . ఈ బ్యూటీ తనదైన అదిరిపోయే స్టైలిష్ లుక్స్ తో ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేస్తుంటుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే పిక్స్ కోసం ఫ్యాషన్ ప్రియులు ఎప్పుడూ వేయి కళ్ళతో వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఈ చిన్నది అదిరిపోయే ఎత్నిక్ అవుట్ ఫిట్ వేసుకుని సోషల్ మీడియా ను షేక్ చేసింది. తన అందమైన లుక్స్ తో అందరి మనసులను గెలుచుకుంది.

వెడ్డింగ్ సీజన్స్ ఉండటంతో తాజాగా ఓ అద్భుతమైన ఎత్నిక్ ఫోటో షూట్ చేసింది షెహ్నాజ్ కౌర్ గిల్. రింపుల్ అండ్ హరిప్రీత్ నరూలా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ డిజైనర్ షరారా సెట్ ను ఎంచుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ . ఈ డిజైనర్ షెల్ఫ్ నుంచి ఎంపిక చేసుకున్న షరారా సెట్ లో అందమంతా ఈ భామ సొంతమైంది. గోధుమ రంగు బ్యాక్ డ్రాప్ లో హెవీ డిజైన్ తో వచ్చిన ఈ లేహీనంగా సెట్ అదిరిపోయింది. రకరకాల రంగులతో వచ్చిన పూసలు ,చమ్కీలు, త్రేడ్స్, స్టోన్స్ తో డిజైనర్ షరారా ను గ్రాండ్ గా డిజైన్ చేశాడు.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా జ్యువెల్లరీ ని ఎంచుకుంది షెహ్నాజ్ కౌర్ గిల్. మేడలో భారీ పూసలతో డిజైన్ చేసిన చోక్ర్ నెక్ పీఎస్ ను అలంకరించుకుంది. ఈ నెక్ లెస్ కు సెట్ అయ్యే భారీ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. చేతి వెలికి స్టోన్స్ తో డిజైన్ చేసిన హెవీ ఉంగరం పెట్టుకుంది. ఈ జ్యువెల్లరీని షెహ్నాజ్ కౌర్ గిల్ మినెరాలి స్టోర్ నుంచి ఎన్నుకుంది.

స్టైలిస్ట్ జున్ని ఖైరియమ్ షెహ్నాజ్ కౌర్ గిల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. షెహ్నాజ్ తన కురులతో మధ్య పాపిట తీసి అందమైన జెడ వేసుకుంది. మేకప్ ఆర్టిస్ట్ రూబీ ఇరానీ షెహ్నాజ్ కౌర్ గిల్ అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది. సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.
