Janhvi Kapoor : పార్టీలైన, వీకెండ్స్ అయినా స్టార్ స్టడ్ ఫ్యాషన్ ఈవెంట్లు అయినా బాలీవుడ్ భామలు బ్లాక్ అవుట్ ఫిట్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తుంటారు. బోల్డ్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తారు. తాజాగా బాలీవుడ్ ఫ్యాషన్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్లు బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకుని తన అందాలు చూపిస్తూ అభిమానులను అలరించింది . సోషల్ మీడియాలో బ్లాక్ అవుట్ fit తో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసి ఫాలోవర్స్ ను మంతముగ్ధులను చేస్తోంది.

జాన్వీ కపూర్ ఇటీవల స్టార్-స్టడెడ్ గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్ 2022ని అందుకుంది. ఈ అవార్డ్ ఫంక్షన్ కోసం ఈ బ్యూటీ బ్లాక్ లేటెక్స్ బాడీ-హగ్గింగ్ గౌను వేసుకుని షోను దొంగిలించింది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యేలా ఆమె లేటెక్స్ గ్లోవ్స్ జత చేసి వింటేజ్ టచ్‌ను జోడించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.

ఈ గ్లామ్ నైట్ కోసం, జాన్వీ కపూర్ తన దుస్తులను ఏస్ ఇండియన్ డిజైనర్ సైషా షిండే సేకరణ నుండి ఎంచుకుంది. ఎలాంటి ఆభరణాలను ధరించకుండానే మెరిసిపోయింది జాన్వీ. తన కురులతో సైడ్ పాపిట తీసుకుని లీవ్ చేసింది.ఈ క్రమంలో చేసిన ఫోటో షూట్ కోసం హాట్ పోజులు ఇచ్చి కుర్రాళ్ళ మనసు దోచేసింది.

ఓ వైపు సినిమాలతో బిజీ గా ఉంటూనే మరోవైపు లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ తో ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేస్తోంది జాన్వీ కపూర్. ఎప్పటికప్పుడు ట్రేండింగ్ ఫోటో షూట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ అందించిన ఫ్యాషన్ స్టైల్స్ ను ఫ్యాషన్ లవర్స్ ఫాలో అవుతుంటారు. తాజాగా చేసిన బాడీ కాన్ డ్రెస్ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టైట్ ఫిట్ డ్రెస్ లో ఈ బ్యూటీ తన వయ్యారాలు చూపిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది.
