Pathaan : బాలీవుడ్‌లో ప్రస్తుతం పఠాన్ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ మూవీ టీం తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ బేషరమ్ రంగ్ పాట పెద్ద దుమారమే లేపుతోంది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె వస్త్రధారణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల నుంచి సామాజిక వేత్తల వరకు దీపికా వస్త్రధారణలో మార్పులు తీసుకురావాలని సోషల్ మీడియా వేధికగా ట్రోలింగ్ నడుస్తోంది. తాజాగా పఠాన్ మూవీ నటీ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై మజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా బీహార్ కోర్టులో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పాటలో వీరు నటించారని వీరిపైన కేసు నమోదు చేయాలని కోర్టును కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుధీర్ ఓజా ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యప్రదేశ్ మంత్రి మిశ్రా కూడా దీపికా వస్త్రధారణపై మండిపడ్డారు వెంటనే ఆమె దుస్తులను సరిచేయాలని మిడియా ముఖంగా తెలియజేశారు. దీపికా వస్త్రధారణలో మార్పు లేకుండా సినిమా థియేటర్లలో విడుదల కాకుండా ఉండేందుకు ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు. ఇదే సందర్భంలో ఇండోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో దీపికా పదుకొణె దిష్టిబొమ్మలను తగలబెట్టి ఆందోళన చేశారు. మరి ఇంతటి దుమారం రేపుతున్న ఈ పాటలో సినిమా యూనిట్ ఎలాంటి మార్పులను చేయనుంది. వీరి డిమాండ్‌కు తలొగ్గి దీపికా వస్త్రధారణను సరిచేస్తారో వేచి చూడాల్సింది. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఈ పాట తెగ వైరల్ అవుతోంది. యూత్ ఈ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంత మంది ఫ్యాషనిస్టులు దీపికా బికినీ లుక్‌లో ఇరగదీసిందంటూ కితాబిస్తున్నారు. షారుఖ్ కూడా సిక్స్ ప్యాక్ తో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.