Jacqueline Fernandez : డిసెంబర్ నెల వస్తే చాలు ఎంత ఉత్సాహంగా ఉంటుందో అందరికి తెలుసు. సెలవులు కాకుండా, ఇది పండుగ సీజన్ . విహారయాత్రలు, కలయికలు, కుటుంబ కార్యక్రమాలు డిన్నర్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్ సమయం. మరు ఇన్ని పార్టీలకు అటెండ్ అవుతూ మీ లుక్ ను ఆధునికంగా మార్చుకోవాలనుకుంటే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ స్టైల్స్ ను ప్రేరణగా తీసుకోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.

Jacqueline Fernandez : డిసెంబర్ 23న విడుదల కానున్న తన రాబోయే చిత్రం సర్కస్ ప్రమోషన్స్ కోసం శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బ్లాక్ అవుట్ ఫిట్ ను ధరించి ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసింది. బ్లాక్ స్ట్రాప్ బ్రాలెట్ , దానికి జోడిగా బ్లాక్ మిడి స్కర్ట్ వేసుకుని వీటి పైగా సీ-త్రూ నెట్ మెష్ ధరించి హాట్ లుక్స్ తో అదరగొట్టింది.

సోషల్ మీడియా లో గత కొన్ని రోజులు ఇనాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ సర్కస్ మూవీ తో మళ్ళీ ఆక్టివ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ పనిలో బిజీ బిజీ గా ఉంది. ఈ సందర్బంగా ఈ నెట్టెడ్ డ్రెస్ లోనూ హాట్ ఫోటో షూట్ చేసింది చిన్నది. ఆ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు అమ్మడి అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లో శ్రీలంక, కెనడియన్ మలేషియా సంతతికి చెందిన బహుళజాతి యురేషియన్ కుటుంబంలో పుట్టి పెరిగింది . యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలు అయ్యింది. శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేసిన తర్వాత, ఆమె మోడలింగ్ పరిశ్రమలో చేరింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది .

ఆ తర్వాత మిస్ యూనివర్స్ 2006లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2009లో అలాదిన్ చిత్రం తో వెండి తెరపై అరంగేట్రం చేసింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అప్పటి నుండి హిందీ చిత్ర పరిశ్రమలో కెరీర్‌ని కొనసాగిస్తోంది. లేటెస్ట్ గా సర్కస్ తో మళ్ళీ అలరించేందుకు సిద్దమైనది.
