Vishakapatnam : చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వచ్చీ రాని మాటలతో వారు చేసే చేష్టలు వారిలోని అమయకత్వాన్ని ప్రదర్శిస్తాయిVishakapatnam : చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వచ్చీ రాని మాటలతో వారు చేసే చేష్టలు వారిలోని అమయకత్వాన్ని ప్రదర్శిస్తాయి. మరీ మారాం చేస్తుంటే కోపంతో కసురుతాం లేదా భయపెడతాం అంతే కానీ ఈ అంగనవాడీ ఆయా ఏకంగా మూడేళ్ల చిన్నారి ముఖంపైన అగ్గిపుల్లతో కాల్చి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.

వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా సీతంపేట పరిధిలోని రాజేంద్రనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నరి అల్లరి చేస్తోందని ఆ కేంద్రంలో పని చేస్తున్న ఆయార అగ్గిపుట్టి అంటించి ముఖంపైన చురకలు పెట్టింది. దీంతో ఆ బాలిక ముఖంపైన కాలియ గాయాలు ఏర్పడ్డాయి. ఆటలు పాటలు నేర్పిస్తున్న సమయంలో అల్లరేంటని ఆయా ఈ విధంవగా చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రం పైనే సీడీపీఓ కార్యాలయం ఉన్నా ఆయా ఇలా చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడే ఇలా ఉంటే మిగతా అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.