Pawan Kalyan Varahi : వారాహి ఇకపై రయ్యి రయ్యి మంటూ రోడ్డుమీద దూసుకెళ్లనుంది. పవన్ కళ్యాణ్ వాహనానికి అన్ని లైన్లు క్లియర్ కావడంతో ఇక ప్రచారమే తరువాయి అన్నట్లుగా మారింది. వారాహి బండిని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక్కో రోజు ఒక్కో కాంట్రవర్సీ నడిచింది. బండి రంగు కు సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ చాలా మంది కామెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పెద్ద వివాదమే నెలకొంది. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు పవన్ వెహికల్ కి అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా కేటాయించారు. అందరూ అభ్యంతరాలు తెలిపినట్టు వారాహి రంగు ఆలీ గ్రీన్ కాదని ఇది ఎమరాల్డ్ గ్రీన్ అండ్ స్పష్టం చేస్తూ TS 13 EX 8384 రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించారు.

Pawan Kalyan Varahi :రానున్న ఎన్నికల కోసం తన ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కొత్తగా వారాహి వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ వెహికల్ కి సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో పంచుకున్నారు. అయితే పవన్ ప్రచార వాహన రంగుకు సంబంధించిన పెద్ద వివాదమే నెలకొంది. చాప్టర్ 121 కేంద్ర మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆర్మీ వెహికల్స్ కి తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకు ఆల్ ఈ గ్రీన్ కలర్ వేయకూడదు అన్నది నిబంధన. అయితే ప్రారంభంలో పవన్ కళ్యాణ్ వాహనం రంగు కూడా ఆలీ గ్రీన్ అని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే అది ఆలీ గ్రీన్ కాదండి ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం కావడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

వారాహి వెహికల్ ను అత్యాధునిక టెక్నాలజీ తో తయారు చేశారు. ప్రచారం జరిగే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు నెలకొనడంతో అలాంటి సమస్యలు ఏమి రాకుండా ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. ఇక పవన్ మాట్లాడే ప్రతి మాట వేలాదిమంది ప్రజలకు స్పష్టంగా వినిపించేలాగా అత్యాధునిక సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఇక పవన్ భద్రత కోసం నాలుగు వైపులా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక లోపల పవన్ తో పాటు మరో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంటుంది. వాహనాలు లోపలి నుంచి పైకి వెళ్ళేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి.