గత కొంతకాలంగా టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. తామిద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామని నేరుగా మీడియా ద్వారానే నరేష్, పవిత్ర లోకేష్ తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో కొన్ని యుట్యూబ్ చానల్స్, వెబ్ సైట్స్, అలాగే మీమ్స్ క్రియేటర్స్ పనిగట్టుకొని వారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. విపరీతంగా వారి వ్యక్తిగత జీవితాన్ని బద్నాం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక కృష్ణ మృతి సమయంలో కూడా పవిత్ర లోకేష్, నరేష్ గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేశారు.
దీనిపై ఇప్పటికే వీరిద్దరూ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్రోలింగ్ వ్యవహారంపై నరేష్-పవిత్ర లోకేష్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న యుట్యూబ్ చానల్స్, మీడియా సంస్థలపై పరువునష్టం కేసుని ఫైనల్ చేశారు. ఇక దీనిని టేకప్ చేసిన కోర్టు. నరేష్-పవిత్ర లోకేష్ వ్యక్తిగత ఇమేజ్ కి భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన సామాజిక, మీడియా మాధ్యమాలపై దృష్టి పెట్టి వారికి నోటీసులు ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు.
ఇక తమపై జరుగుతున్న ట్రోలింగ్ వెనుక నరేష్ మూడో భార్య రమ్య కూడా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక పవిత్ర లోకేష్ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్న ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదని ఆమె సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి.