Aryan khan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త్వరలో వెండితెరపై తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మధ్యనే డ్రక్స్ కేసులో చిక్కుకొని జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ ఆ చేదు అనుభవాలను తుడిచేసేందుకు సరికొత్త మార్గాన్ని వెతుక్కున్నాడు. అయితే చూడ్డానికి హీరో కటౌట్ ఉన్న దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు రెడీ అయ్యాడు.

Aryan khan : ఓటీటీ ప్లాట్ ఫామ్ పుణ్యమా అని ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో కనిపిస్తూ అభిమానులను అల్లరిస్తున్నారు. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగానే ఆర్యన్ ఖాన్ ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నాడు. ఈ క్రమంలో స్క్రిప్ట్ ను ఫోటో తీసిన ఆర్యన్ తన ఫాలోవర్స్ కు షేర్ చేసాడు. రైటింగ్ పూర్తయింది యాక్షన్ చెప్పడమే ఇకపై పని అని ఆ ఫోటో కింద క్యాప్షన్ ని జోడించాడు. ఈ పిక్ ని చూసిన షారుక్ ఖాన్ నీ కలలు నిజం చేసుకోబోతున్నావు అంటూ రిప్లై ఇచ్చేసారు. భవిష్యత్తులో ఇలా ఎన్నో ప్రాజెక్టులు చేయవచ్చు కానీ ఫాస్ట్ ది ఎప్పుడు బెస్ట్ ఏ అని షారుక్ ఖాన్ పేర్కొన్నాడు.

ఇక అన్న డైరెక్టర్ అవుదామని కలలు కంటూ ఉంటే, చెల్లి సుహానా ఖాన్ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయింది. ఈ విషయంలోనూ అన్నయ్య బాటలోనే నడుస్తోంది సుహానా. ఓ వెబ్ సిరీస్ తో సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ది ఆర్చిస్ అని వెబ్ సిరీస్ లో కీలక పాత్రను పోషిస్తుంది సుహానా. ఆర్చీస్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతోంది. ఇదే వెబ్ సిరీస్ లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా నటిస్తోంది. వచ్చే ఏడాది ఇది ఓటీటీలో స్క్రీనింగ్ కానుంది.

డ్రగ్స్ కేసులో తీవ్ర మనోవేదనకు గురైన ఆర్యన్ ఖాన్ తనపై పడిన నెగెటివ్ మార్కుని తుడిచి వేసేందుకు డైరెక్టర్ గా తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఆర్యన్ ఈ మొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనమూ ఆశిద్దాం.