MP Badruddin Ajmal : హిందువుల పెళ్లిళ్లు వారి సంతానానికి సంబంధించిన విషయాలపైన అసోం ఎంపి ఆల్ ఇండియన్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్దుద్దీన్ అజ్మల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పెళ్లికి ముందే హిందూ అబ్బాయిలు అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారని, అందుకే వారు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఎంపీ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అంటూ నేటిజన్లు ఫైర్ అవుతున్నారు.

MP Badruddin Ajmal : అయన ఇక్కడితో ఆగలేదు సవివరంగా హిందువుల అబ్బాయిలకు పెళ్లిళ్లు ఎందుకు ఆలస్యంగా జరుగుతాయో వారికి పిల్లలు కలగడంలో కూడా ఎందుకు ఆలస్యం జరుగుతుందో వ్యాఖ్యలు చేశారు. చాలామంది హిందూ అబ్బాయిలు 40 ఏళ్ల తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఇలా ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు అని ఆయన పేర్కొన్నారు. ముస్లిం అబ్బాయిలు ఏ విధంగా చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంటారో అదే విధంగా హిందువులు వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ కులంలో 21 ఏళ్లకే పిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తామని చెప్పుకొచ్చారు. ఇక అక్కడితో ఆగకుండా హిందూ అబ్బాయిలు అసలు ఎందుకు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారో కూడా చెప్పారు. హిందూ అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని తీరిగ్గా 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నారు అన్నారు. అందుకే చాలామంది హిందువులకు ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టడం లేదని ఒకవేళ పుట్టినా తక్కువే నని పేర్కొన్నారు. ఈ సమస్య తలెత్తకూడదనే తమ పిల్లలకు యుక్త వయసులోనే పెళ్లిళ్లు చేస్తామని చెప్పుకొచ్చారు.
హిందూ అమ్మాయిలకు సంబంధించి కూడా హాట్ కామెంట్ చేశారు ఎంపీ బద్దుద్దీన్ అజ్మల్. అమ్మాయికి 19 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోవాలని అలా చేస్తే వారికి తొందరగా సంతానం కలుగుతుందని ఆయన తెలిపారు. ఎంపీ హజ్ వెల్ ఒక్కసారిగా హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. నటిజన్లు ఓరెంజ్ లో ఎంపీ పై ఫైర్ అవుతున్నారు. మరి ఈ హాట్ కామెంట్స్ ఎక్కడి వరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే ఎంపికి రీ కౌంటర్ ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో చూడాల్సిందే.