లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అయితే మోహన్ లాల్ నటించిన లూసీఫర్ మూవీ తెలుగులో డబ్ చేసి ఓటీటీలో కూడా రిలీజ్ చేసిన తర్వాత చిరంజీవి ఈ మూవీ రీమేక్ చేయడం సంచలనంగా మారింది. మోహన్ రాజా మీద నమ్మకంతో కథలో కొత్తదనం కొత్తగా చెబుతారని భావించి ఈ రీమేక్ కోసం చిరంజీవి వర్క్ చేశారు. ఇక సినిమాని డిస్టి బ్యూటర్స్ కి ఇవ్వకుండా నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఊహించని స్థాయిలో సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అలాగే థియేటర్స్ ద్వారా సినిమా కలెక్షన్స్ తక్కువగా వచ్చిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలిసి ఈ మూవీ ఏకంగా 150 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఓ హిందీ ఛానల్ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ పై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీమేక్ సినిమాలు చేయడం తప్పు కాదని, అయితే చేసినపుడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ తో ఆడియన్స్ పోల్చి చూస్తారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
అయితే గాడ్ ఫాదర్ సినిమా ని లూసీఫర్ తెలుగులో డబ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా కేవలం హీరోయిక్ ఇమేజ్ తోనే తెరకెక్కించామని, దానికి తగ్గట్లుగానే, క్యాస్టింగ్ కారణంగా ఆ మూవీ హిట్ అయ్యిందని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే కలెక్షన్స్ కూడా 150 కోట్ల వరకు వచ్చాయని తెలిపాడు. అయితే తాను భవిష్యత్తులో రీమేక్ చేయాల్సి వస్తే కచ్చితంగా ఒరిజినల్ ఫిల్మ్ ఒటీటీలో రిలీజ్ చేయకుండా ప్రొడ్యూసర్ రిక్వస్ట్ చేస్తామని చెప్పారు.