Comedian Ali: తన కామెడీ మూవీస్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆలీ గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈమధ్య ఆలీకి దశతిరిగింది. ఏది పట్టిన బంగారమే అన్నట్లుగా వరుసగా అన్ని అలా కలిసి వస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి మరి ఆదికి పదవిని ఇచ్చారు.
సరిగ్గా అదే టైం కి అతని కూతురికి పెళ్లి కుదరడం తో ఇప్పుడు ఆలీ ఇల్లు కళకళలాడుతోంది. ఈ క్రమంలో ఆలీ అల్లుడు గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆలీ కూతురు ఫాతిమా డాక్టర్ కోర్స్ చేస్తుంది. ఇప్పుడు తను పెళ్లి చేసుకున్న షెహ్యాజ్ కూడా డాక్టరే.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే షెహ్యాజ్.. జమీలా బాబీ, జిలానీ భాయ్‌ల రెండో కొడుకు. షెహ్యాజ్ అన్న భార్య కూడా డాక్టరే కావడం విశేషం. షెహ్యాజ్ కుటుంబం నేటివ్ ప్లేస్ గుంటూరు. కానీ ప్రస్తుతం వీళ్లంతా లండన్ లో సెటిల్ అయినట్లు సమాచారం.
షెహ్యాజ్ వాళ్లది మంచి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ మాత్రమే కాదు.. బాగా రిచ్ ఫ్యామిలీ అట. ప్రస్తుతం ఫాతిమా కూడా డాక్టర్ కోర్స్ చదువుతూ ఉండడంతో తనకు కాబోయే భర్త కూడా డాక్టర్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆలీ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఎందరో సినీ ప్రముఖులు తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలీ తన కూతురికి పెళ్లి సందర్భంగా కట్నంతో పాటు ఒక ఇంటిని కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
Comedian Ali:
ప్రస్తుతం ఆలీ కు సినిమాల్లో ఛాన్స్ తగ్గిందని చెప్పాలి. కానీ ఇంకా పలు రకాల టీవీ షోస్ లో ఆలీ తనదైన ట్రేడ్ మార్క్ కామెడీతో సందడి చేస్తూనే ఉన్నాడు. అలీ ఒక సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ లో అలీ నటించారు.