Bhumi Pednekar : వెడ్డింగ్ సీజన్ వస్తే చాలు బాలీవుడ్ హీరోయిన్ లు ఎత్నిక్ లుక్ లో కనిపిస్తూ కుర్రాళ్ళకు పిచ్చేక్కిస్తుంటారు . బాలీవుడ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ లు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అందిస్తూ స్టార్స్ కు మరింత గ్లామర్ ను జోడిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన వార్డ్‌రోబ్ నుండి నేరుగా మీ కోసం ఫ్యాషన్ చిట్కాలను అందిస్తోంది. సాంప్రదాయ చీరకు ఆధునిక అప్‌డేట్ లను అద్దుతూ అందరిని అవాక్కు చేస్తోంది.

Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ కు స్టేట్‌మెంట్ చీరలు డిజైనర్ లెహంగాలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఇటీవల, భూమి తన బెస్ట్ ఫ్రెండ్ వివాహానికి చీర కట్టుతో హాజరై తెగ హడావిడి చేసింది. తన లుక్‌కి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసం భూమి బ్రాలెట్ బ్లౌజ్ కు టై-డై ప్రింటెడ్ స్టేట్‌మెంట్ చీరను జత చేసింది. ఆక్సిడైజ్డ్ జ్యువెల్స్ ను వేసుకుని అదరగొట్టింది. ఈ అదిరిపోయే చీరతో హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాషన్ ప్రియులకు వెడ్డింగ్ సీజన్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందించింది.

డిజైన్ విషయానికి వస్తే భూమి పెడ్నేకర్ నలుపు, తెలుపు , గోధుమ రంగులలో కలంకారి ఎంబ్రాయిడరీలో అలంకరించబడిన స్లీవ్‌లెస్ బ్రాలెట్ బ్లౌజ్ ను వేసుకుంది. విశాలమైన పట్టీలు, డీప్ నెక్‌లైన్ తో పాటు బస్ట్‌కు సపోర్ట్ చేయడానికి , బ్లౌజ్‌కి అత్యద్భుతమైన ట్విస్ట్ ఇవ్వడానికి అండర్‌వైర్ వివరాలు ఈ బ్లౌజ్ కు అందించారు డిజైనర్లు.

భూమి బ్రాలెట్ బ్లౌజ్‌తో కాంట్రాస్ట్ బ్లూ షేడ్‌లో స్టేట్‌మెంట్ బెనారసి చీరను ధరించింది. నీలం , తెలుపు టై-డై నమూనాలు , సిల్వర్ ఎంబ్రాయిడరీ వచ్చిన ఈ చీర భూమికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

రత్నాలు , ముత్యాలతో అలంకరించబడిన చోకర్ నెక్లెస్ ను మెడ అలంకరించుకుని , మ్యాచింగ్ డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. చేతులకు భారీ కంకణాలు, చమత్కారమైన ఉంగరాలను ధరించింది. స్టేట్‌మెంట్ ఆక్సిడైజ్డ్ వెండి , కాంస్య ఆభరణాలలో భూమి ఎంతో స్టైలిష్ గా కనిపించి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.