Vastu: వాస్తు శాస్త్రంలో అనేక విషయాలు మన నిత్య జీవితంలో పనికి వస్తాయని పండితులు చెబుతున్నారు. పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి అనేక మార్గాలను వాస్తు పండితులు పేర్కొన్నారు. అలాగే నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి కూడా పలు పద్ధతులను వాస్తు శాస్త్రంలో వివరించారు. ఇంట్లో మనకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని, ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులను పాటించి నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి పారదోలాలని చెబుతున్నారు.
నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురి కావడం, ఇబ్బందులు పడటం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ధన నష్టంతోపాటు అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరిస్తున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు పెరగడం, వైవాహిక బంధం బలహీనపడటం జరుగుతాయంటున్నారు. ఇలాంటి సమస్యలను నివారించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పరార్..
మన వంటింట్లో దొరికే వాటిలో ఉప్పు ఒకటి. దీనికి అత్యంత శక్తిమంతమైన వస్తువుగా పేరుంది. ఆహారంలో రుచిని పెంచడంతోపాటు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి సాల్ట్‌కు ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవాలంటే గురువారం రోజున కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ తుడుపుకర్ర నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తర్వాత ఇల్లంతా తుడుచుకోవాలట. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుందని చెబుతున్నారు. దాంతోపాటు టాయిలెట్‌లో ఓ గాజు గిన్నెలో కొద్దిగా ఉప్పు ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయట.
Vastu:
పూజ గదిలో మనం వినియోగించే వస్తువు కర్పూరం. రోజూ ఉదయాన్నే ఒక చిన్న అగరబత్తీలో కర్నూరాన్ని ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుందని చెబుతున్నారు. అలాగే తులసి మొక్కను పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. సాధారణంగా తులసి మొక్కను హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవిగా కొలుస్తారు. మరోవైపు తరచూ ఇంట్లో చప్పట్లు కొట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని చెబుతున్నారు.