Relationship: మాటల యుద్ధం, మనస్పర్దల కారణంగా చాలా కుటుంబాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇగో సమస్యల కారణంగా చాలా కుటుంబాల్లో పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు విడాకుల వరకు కూడా వెళ్తుంటారు. దాంతోపాటు శృంగారపరంగా కొన్ని తప్పులు చేయడం వల్ల కూడా సంసారంలో నిప్పులు పోసుకున్న వారవుతుంటారు. ఈ క్రమంలో లైంగిక జీవితాన్ని పాడు చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉంటాయి.
శృంగార జీవితం సంతృప్తికరంగా లేదంటే వారి నిత్య జీవితంలో కూడా అసంతృప్తిగా సాగుతూ ఉంటుందని చెప్పవచ్చు. మీ శృంగార జీవితంపై మీకు కావలసిన అభిరుచిని చంపే కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే స్వయంగా చేతులారా మీ జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వైవాహిక జీవితం, శృంగార జీవితం ఆనందంగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
మనసు విప్పి మాట్లాడాలి..
దాంపత్య జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ భాగస్వామి మిమ్నల్ని క్రమం తప్పకుండా సంతృప్తి పరచాలని కోరుకోవడంలో తప్పు లేకపోయినా, అందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. భాగస్వామి సంతృప్తి పరచకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో నిరాశ చెందకుండా ఉండాలి. భాగస్వామితో కాస్త మనసు విప్పి మాట్లాడాలి. ఇబ్బందులను తెలుసుకోవాలి. వారికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయో, బెడ్‌పై ఎలా మసలుకుంటే వారికి ఇష్టమో తెలుసుకొని అలా చేయగలగాలి.
Relationship:
వారికి నచ్చని పనులుంటే అలాంటివి వీలైనంత త్వరగా మానుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేయకపోతే బంధాన్ని బలహీనపర్చుకున్నట్లు అవుతుంది. భాగస్వామికి అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులతో సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో మీకు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు మీరే తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, మీకు సహజంగా తక్కువ టెస్టోస్టెరాన్ ఉండవచ్చు. డాక్టర్ వాటిని సరిదిద్దడానికి మార్గాలను సూచిస్తారు. మరోవైపు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి వల్ల శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేస్తాయని చెబుతున్నారు. సమయానికి నిద్రపోవడం, వేళకు తిండి తినడం లాంటివి చేయాలి. గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోతుండాలి. ఇలా చేస్తే శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు.