నిన్నటి ఎపిసోడ్ అంతా కోర్టులోనే ఉంటుంది. అక్కడ మాళవిక జడ్జిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. కానీ లాయర్ ఝాన్సీ మాళవిక మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దాంతో మాళవిక సమాధానం చెప్పలేక తడబడుతుంది. ఆ తర్వాత యశోధర్ కోర్టు బోనులోకి వచ్చి ఏం చెప్తాడో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
ఆక్సిడెంట్ జరిగిన టైంలో మాళవిక నాతోనే ఉందంటాడు యశ్. దాంతో అందరూ ఒక్కసారిగి షాకవుతారు. మాళిని కొడుకుని తిట్టుకుంటుంది మనసులో. లాయర్ ఝాన్సీ ఎక్కడున్నారు ఆ టైంలో అని అడగ్గా.. అది మా పర్సనల్ మ్యాటర్ అంటాడు యశ్ కోపంగా. మాళవిక మీ ఎక్స్ వైఫ్.. అది మీ పర్సనల్ కాదంటుంది ఝాన్సీ. అయినా మీరు మాళవికని కలిసిన విషయం వేదకు తెలుసా? అంటూ యశ్‌ని ప్రశ్నిస్తుంది. భర్త ప్రవర్తన చూసి బాధపడుతుంది వేద. యశ్ మాత్రం సమాధానం చెప్పకుండా.. ఆపండి లాయర్ గారూ అంటాడు. ‘నా వేదకు విడాకులు.. మీకు నోరెలా వచ్చింది. వేద గురించి దయచేసి అలా మాట్లాడకండి’ అంటాడు యశ్ ఝాన్సీతో.
వేదకు కలలో కూడా ద్రోహం చేయనంటాడు యశ్. వేద మీద ఒట్టేసి మాళవిక ఆ రోజు మీతో ఉందా లేదా చెప్పమంటుంది ఝాన్సీ. అపుడే వేద లేచి జడ్జిగారు.. నేను నా లాయర్‌లో మాట్లాడొచ్చా అని అడుగుతుంది. పర్మిషన్ గ్రాంట్ చేస్తాడు జడ్జి. ఝాన్సీ వేద దగ్గరికి వెళ్లి ఎందుకు ఆపావ్ వేద అని అడుగుతుంది. ప్లీజ్ లాయర్ గారూ మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగొద్దు అని వేడుకుంటుంది వేద. సరే నీకోసం వేరే దారిలో ప్రయత్నిస్తానంటుంది లాయర్. జడ్జితో యశోధర్ గారి విచారణ పూర్తయిందని చెప్తుంది ఝాన్సీ. కోర్టు తీర్పుని వాయిదా వేస్తాడు జడ్జి.
సీన్ కట్ చేస్తే.. ఇంటికెళ్లిన మాళినిని ఏమైందని అడుగుతాడు రత్నం. కొడుకు వాడిని ఈ రోజు కోర్టులో చూసి నా గుండె ముక్కలయిందని చెప్తుంది భర్తతో. కానీ రత్నం మాత్రం కొడుకుకే సపోర్ట్ చేస్తాడు. నా దిగులంతా మన వేద గురించే రత్నం అనుకుంటూ బాధపడుతుంది మాళిని. ఈ సమస్యకి పరిష్కారం ఎపుడు దొరుకుతుందో ఏమో అంటుంది మాళిని.
కోర్టులో ఒంటరిగా కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంది వేద. ఝాన్సీ వచ్చి ఏమైంది వేద.. ఎందుకిలా చేశావ్ అంటూ నిలదీస్తుంది. ఇంకో నిమిషం ఆగి ఉంటే నిజం రాబట్టేదాన్ని అంటుంది లాయర్. ఆ టైంలో మాళవిక యశోధర్‌తో ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే నెత్తుటి మడుగులో ఉన్న మా అమ్మని ఆస్పత్రిలో చేర్పించి కాపాడాడంటూ ఎమోషనల్ అవుతుంది వేద. ఒక్క నిమిషం ఒక్క ఆగి ఉంటే కేసు గెలిచేవాళ్లం అంటుంది ఝాన్సీ. ఆయన గౌరవం కాపాడడం నా బాధ్యత. మీ ప్రశ్నలకు ఆయన కుమిలిపోవడం నేను కళ్లారా చూశాను. నా భర్త క్యారెక్టర్ మీద మచ్చ పడితే నేను తట్టుకోలేను. మా ఇద్దరి పెళ్లి ఒప్పందమే కానీ మేం భార్యాభర్తలం. నా గురించి ఆయన ఆలోచించకపోయిన ఆయన గురించి నేను ఆలోచిస్తున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది వేద. భార్య మాటల్ని వెనక నుంచి వింటాడు యశ్. నా భర్త నిజాయితీని తుది శ్వాస వరకు నమ్ముతాను. లాయర్ గారూ శారీరకంగా మేము భార్యాభర్తలమే కాదు. కానీ ఏదో తెలియని బంధం మా మధ్య ఉంది అంటుంది వేద ఝాన్సీతో.
మీరు కేసు గెలవండి కానీ యశోధర్ గారిని మాత్రం మీ ప్రశ్నలతో హర్ట్ చేయకండని లాయర్‌ని వేడుకుంటుంది వేద. నేను లాయర్‌ని మాత్రమే కాదు వేద.. తల్లిని, భార్యని, ఆడదాన్ని. కానీ నీ లైఫ్‌లో నీలాంటి ఆడదాన్ని చూడలేదు. ఎంత ప్రేమిస్తున్నావు నువ్ నీ భర్తని. యశోధర్ ఎంత అదృష్టవంతుడో నీలాంటి భార్య దొరికినందుకు అంటూ వేదని కొనియాడుతుంది లాయర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..