Sobhita Dhulipala: అచ్చతెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల. మోడల్ గా దేశవ్యాప్తంగా మరియు నటిగా దక్షిణాన చాలానే ఫేమస్ అయ్యింది ఈ సుందరి. 2013 మిస్ ఇండియా పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన శోభిత.. తెలుగు అందాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత మంచి పాపులర్ అయ్యింది. ఇక ఆ పాపులారిటీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల శోభిత గురించి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోలను వలలో వేసుకున్నట్టు వార్తలు వినిపిస్తన్నాయి. తాను వలలో వేసుకుందో తెలియదు, లేక వీరే వెంటపడ్డారో తెలియదు గాని, వార్తలు మాత్రం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయంలో ఆయా వ్యక్తులు పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు కూడా..
శోభిత ఆ ఇద్దరితో అలా..
అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల కలిసి గూఢాచారి, మేజర్ చిత్రాలలో నటించారు. శేష్ తో లిప్ లాక్స్ కూడా అయ్యియి. శోభితా ధూళిపాళ్ల – అడివి శేష్‌ల మధ్య ఏదో విడదీయరాని బంధం ఉందని, వారు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య సమంతతో విడిపోయాక సన్నిహితంగా ఉంటుంది శోభితా ధూళిపాళ్లతో అని ఈ మధ్య వార్తలు వచ్చి నెట్టింట వైరల్ అయ్యాయి.
అంతేకాకుండా కొన్ని ఫంక్షన్లకి నాగ చైతన్య – శోభితా ధూళిపాళ్ల కలిసి వెళ్లడం, చైతూ పెళ్ళి చేసుకోబోయేది శోభితా ధూళిపాళ్లనే అని ప్రచారం జరిగింది. దీనిపై చైతూ, శోభితా క్లారిటీ ఇచ్చారు. దానితో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అడవి శేష్ తో బంధంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై వారు స్పందిస్తే ఓ క్లారిటీ రావచ్చు.